Monday, 14 September 2026
  • Home  
  • పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత.. మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దాం
- అన్నమయ్య

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత.. మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దాం

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP) విగ్రహాలతో జల కాలుష్యం – ప్రకృతికి హాని చేయని సహజసిద్ధమైన మట్టి ప్రతిమలనే వాడాలి – ప్రజలకు పిలుపునిచ్చిన హెచ్ఆర్పీసీఐ (HRPCI) తిరుపతి జిల్లా చైర్మన్ అందే వెంకటేష్ వినాయక చవితి పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు.. మన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని హెచ్ఆర్పీసీఐ (HRPCI) తిరుపతి జిల్లా చైర్మన్ శ్రీ అందే వెంకటేష్ గుర్తుచేశారు. ఈ మేరకు ఆయన ప్రజలకు ఒక ప్రకటన ద్వారా ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. రాబోయే వినాయక చవితి వేడుకల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP) విగ్రహాలకు బదులుగా కేవలం సహజమైన మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ఉపయోగించాలని ఆయన కోరారు. -మట్టి విగ్రహాలే ఎందుకు వాడాలంటే.. నీటి కాలుష్య నివారణ: పీవోపీ (POP) విగ్రహాలు, వాటికి వేసే ప్రమాదకరమైన రసాయన రంగుల వల్ల చెరువులు, ఇతర నీటి వనరులు తీవ్రంగా కలుషితం అవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతికి మేలు మట్టి వినాయక విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోవడంతో పాటు పర్యావరణానికి ఎలాంటి హాని కలగనివ్వవని వివరించారు.మన భక్తి కారణంగా ప్రకృతికి ఎలాంటి నష్టం వాటిల్లకూడదని, “మట్టి వినాయకుడు – పర్యావరణానికి మేలు” అనే ఈ గొప్ప సందేశాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ వినాయక చవితి సందర్భంగా పర్యావరణ ప్రేమికులు, ప్రజలు, యువ మండలులు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని వెంకటేష్ ఆకాంక్షించారు.”మన భక్తి ప్రకృతిని కాపాడాలి… మన వినాయకుడు మట్టితోనే ఉండాలి!”

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP) విగ్రహాలతో జల కాలుష్యం
– ప్రకృతికి హాని చేయని సహజసిద్ధమైన మట్టి ప్రతిమలనే వాడాలి
– ప్రజలకు పిలుపునిచ్చిన హెచ్ఆర్పీసీఐ (HRPCI) తిరుపతి జిల్లా చైర్మన్ అందే వెంకటేష్ వినాయక చవితి పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు.. మన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని హెచ్ఆర్పీసీఐ (HRPCI) తిరుపతి జిల్లా చైర్మన్ శ్రీ అందే వెంకటేష్ గుర్తుచేశారు. ఈ మేరకు ఆయన ప్రజలకు ఒక ప్రకటన ద్వారా ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. రాబోయే వినాయక చవితి వేడుకల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP) విగ్రహాలకు బదులుగా కేవలం సహజమైన మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ఉపయోగించాలని ఆయన కోరారు.

-మట్టి విగ్రహాలే ఎందుకు వాడాలంటే..

నీటి కాలుష్య నివారణ: పీవోపీ (POP) విగ్రహాలు, వాటికి వేసే ప్రమాదకరమైన రసాయన రంగుల వల్ల చెరువులు, ఇతర నీటి వనరులు తీవ్రంగా కలుషితం అవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రకృతికి మేలు మట్టి వినాయక విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోవడంతో పాటు పర్యావరణానికి ఎలాంటి హాని కలగనివ్వవని వివరించారు.మన భక్తి కారణంగా ప్రకృతికి ఎలాంటి నష్టం వాటిల్లకూడదని, “మట్టి వినాయకుడు – పర్యావరణానికి మేలు” అనే ఈ గొప్ప సందేశాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ వినాయక చవితి సందర్భంగా పర్యావరణ ప్రేమికులు, ప్రజలు, యువ మండలులు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని వెంకటేష్ ఆకాంక్షించారు.”మన భక్తి ప్రకృతిని కాపాడాలి… మన వినాయకుడు మట్టితోనే ఉండాలి!”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.