కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో, మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం – 2026’ కార్యక్రమం శుక్రవారంతో విజయవంతంగా ముగిసింది. 47 రోజుల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా 1,10,24,319 ఇళ్లను నేరుగా సందర్శించాయి. అంటే మొత్తం 1,35,91,105 ఇళ్లలో ఏకంగా 81.11 శాతం కుటుంబాలను కవర్ చేశారు. రెండేళ్ల పాలనలో అమలైన సంక్షేమం, అభివృద్ధిని ప్రతి ఇంటికీ వివరిస్తూ, ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. ప్రజాప్రతినిధులు, ఇన్ఛార్జులు, బూత్ స్థాయి కార్యకర్తల అంకితభావంతో ఈ కార్యక్రమం విశేష స్పందన పొందింది

ఇంటింటికీ తెలుగుదేశం గ్రాండ్ సక్సెస్