ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన ఆధ్వర్యంలో శనివారం ఖమ్మం నగరంలో ‘జనసేన శంఖారావం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి మిర్యాల రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా నగరంలో జనసైనికులతో భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం ఎంబీ ఫంక్షన్ హాల్లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై సభలో చర్చించనున్నట్లు తెలిపారు. శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జనసేన శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయని రామకృష్ణ పేర్కొన్నారు.



