భూపాలపల్లి, సెప్టెంబర్ 11:
సామాజిక న్యాయ వేదిక ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం జిల్లా కేంద్రంలో నిర్వహించగా, వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సామాజిక న్యాయ వేదిక జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను నేర్పిస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించడం అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందిస్తున్న పలువురు ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి, ప్రశంసాపత్రాలు అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు సామాజిక న్యాయ వేదిక నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో సామాజిక న్యాయ వేదిక ప్రతినిధులు, భాస్కర్ సీనియర్ ఉపాధ్యాయుడు, ఇతర ఉపాధ్యాయులు, విద్యాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సామాజిక న్యాయ వేదిక ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
భూపాలపల్లి, సెప్టెంబర్ 11: సామాజిక న్యాయ వేదిక ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం జిల్లా కేంద్రంలో నిర్వహించగా, వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయ వేదిక జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను నేర్పిస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందిస్తున్న పలువురు ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి, ప్రశంసాపత్రాలు అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు సామాజిక న్యాయ వేదిక నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సామాజిక న్యాయ వేదిక ప్రతినిధులు, భాస్కర్ సీనియర్ ఉపాధ్యాయుడు, ఇతర ఉపాధ్యాయులు, విద్యాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

