శుక్రవారం అనగా11.09.2026 తేదీ ఉదయం విశాఖపట్నం జీవీఎంసీ మెయిన్ ఆఫీస్ లో జీవీఎంసీ కమిషనర్ శ్రీ కేతన్ గార్గ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని *పాత 88వ వార్డు / నూతనంగా ఏర్పడిన 113వ వార్డులో బంటా కాలనీ చేర్పుపై* వస్తున్న అభ్యంతరాలపై వినతి పత్రాన్ని అందజేసిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు
ఈ యొక్క వినతిలో ముఖ్యంగా పాత 88వ వార్డు నూతన 113వ వార్డుగా పునర్వ్యవస్థీకరించబడింది. మేఘాద్రి గెడ్డ సమీపంలోని బంటా కాలనీని 113వ వార్డులో కలిపారు.బంటా కాలనీకి 113వ వార్డులోని ఇతర గ్రామాలకు భౌగోళికంగా దూరం ఎక్కువ, రాకపోకలకు ఇబ్బంది ఉందని 20,000 మందికి పైగా ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు.అందువల్ల బంటా కాలనీని 113వ వార్డు నుండి తొలగించి పక్కనే ఉన్న నూతన 114 / 118 / 119 వార్డులలో (పాత 95, 93, 94 వార్డుల పరిధిలోకి) కలపాలని ప్రజల తరపున ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు కమిషనర్ గారిని కోరారు.
దీనివల్ల భౌగోళిక సౌలభ్యం, పరిపాలనా సౌలభ్యం, పౌర సేవలు మెరుగవుతాయని, వార్డు సరిహద్దులను ఖరారు చేసేలోపు సానుభూతితో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


