Thursday, 10 September 2026
  • Home  
  • కోడూరు: వినాయక వేడుకలపై పోలీసుల కీలక సూచనలు
- తిరుపతి

కోడూరు: వినాయక వేడుకలపై పోలీసుల కీలక సూచనలు

-మండపాల వద్ద 24 గంటల పర్యవేక్షణ తప్పనిసరి -ఆన్‌లైన్‌లో ముందస్తు అనుమతులు పొందాలని సూచన -నిమజ్జనం వరకు నిబంధనలు పాటించాలని స్పష్టీకరణ రైల్వే కోడూరు: వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు నిర్వాహకులు ముందస్తు చర్యలు చేపట్టాలని రైల్వే కోడూరు గ్రామీణ పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు సూచించారు. మండపం ఏర్పాటు నుంచి విగ్రహ నిమజ్జనం వరకు కార్యక్రమాల నిర్వహణకు ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. మండపాల వద్ద 24 గంటల పాటు పర్యవేక్షణ ఉండేలా నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలన్నారు. పోలీస్, పంచాయతీ, విద్యుత్, అగ్నిమాపక శాఖల నుంచి ఆన్‌లైన్ ద్వారా ముందస్తు అనుమతులు తప్పనిసరిగా పొందాలని సూచించారు. విగ్రహ ప్రతిష్ఠ, నిమజ్జనం తేదీల వివరాలను ముందుగానే పోలీసులకు తెలియజేయాలని స్పష్టం చేశారు. వేడుకల సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబంధనలు పాటించాలని కోరారు.

-మండపాల వద్ద 24 గంటల పర్యవేక్షణ తప్పనిసరి

-ఆన్‌లైన్‌లో ముందస్తు అనుమతులు పొందాలని సూచన

-నిమజ్జనం వరకు నిబంధనలు పాటించాలని స్పష్టీకరణ

రైల్వే కోడూరు: వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు నిర్వాహకులు ముందస్తు చర్యలు చేపట్టాలని రైల్వే కోడూరు గ్రామీణ పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు సూచించారు. మండపం ఏర్పాటు నుంచి విగ్రహ నిమజ్జనం వరకు కార్యక్రమాల నిర్వహణకు ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. మండపాల వద్ద 24 గంటల పాటు పర్యవేక్షణ ఉండేలా నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలన్నారు. పోలీస్, పంచాయతీ, విద్యుత్, అగ్నిమాపక శాఖల నుంచి ఆన్‌లైన్ ద్వారా ముందస్తు అనుమతులు తప్పనిసరిగా పొందాలని సూచించారు. విగ్రహ ప్రతిష్ఠ, నిమజ్జనం తేదీల వివరాలను ముందుగానే పోలీసులకు తెలియజేయాలని స్పష్టం చేశారు. వేడుకల సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబంధనలు పాటించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.