ఆత్మకూరు, సెప్టెంబర్ 10 (పున్నమి ప్రతినిధి): వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆర్డీవో బి. పావని సూచించారు. గురువారం ఆర్డీవో కార్యాలయంలో వినాయక విగ్రహాల ఏర్పాటు, భద్రతా చర్యలు, మౌలిక వసతులు, నిమజ్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీ టి. వెంకటేశ్వర్లు, సీఐ జి. గంగాధర్, ఎమ్మార్వో పద్మజ, మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, ఎలక్ట్రికల్ ఏఈ, అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మండపాల వద్ద విద్యుత్ తీగలను సక్రమంగా ఏర్పాటు చేసి షార్ట్సర్క్యూట్కు అవకాశం లేకుండా చూడాలని సూచించారు. అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మండపాల ఏర్పాటుతో రహదారులు, ప్రధాన కూడళ్లలో రాకపోకలకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. జనసమ్మర్థం అధికంగా ఉండే ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. నిమజ్జనానికి అనువైన ప్రదేశాలను ముందుగానే గుర్తించి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. నిర్వాహకులు నిబంధనలు పాటిస్తూ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆర్డీవో కోరారు.

వినాయక వేడుకలకు పక్కా ప్రణాళిక