కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 10 :
జగ్గంపేటలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలు వడ్డించి, శ్రీకృష్ణ భగవానుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులతో కలిసిపోయి ఆప్యాయంగా పలకరించడంతో కార్యక్రమం సందడిగా మారింది.ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు.యాదవ సంఘం ప్రతి ఏటా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం. జగ్గంపేట అభివృద్ధి కోసం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు వెళ్తాం. ధర్మాన్ని, సేవా భావాన్ని చాటిన శ్రీకృష్ణుడి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి.ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, దేవరపల్లి మూర్తి, కొత్త కొండబాబు, పాండ్రంగి రాంబాబు, వేములకొండ జోగారావు, వైభోగుల కొండబాబు యాదవ్, యాదవ సంఘం అధ్యక్షుడు ఎం రాజు, కొండ్రోతు శ్రీను, నేదురి గణేష్, రీస్ రమణ, దుర్గపు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


