ఖానాపురం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త మహంకాళి భద్రయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న నర్సంపేట ఏఎంసీ (AMC) వైస్ చైర్మన్, ఖానాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శాఖమూరి హరిబాబు గారు భద్రయ్య పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
భద్రయ్య కుటుంబ ఆర్థిక పరిస్థితిని చూసి చలించిన హరిబాబు గారు, అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం తక్షణ సహాయంగా ₹5,000/- ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ కష్ట సమయంలో పార్టీ మరియు నాయకులు వారికి అండగా ఉంటారని ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో కొత్తూరు గ్రామ సర్పంచ్ జాటోతు వినోద్ కుమార్, వార్డు సభ్యులు జాటోతు పద్మా వసురం, జాటోతు బాలు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాంచారి కుమారస్వామి, కోశాధికారి గడ్డం మల్లేష్, సీనియర్ నాయకులు చోల్లేటి సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కందికట్ల కుమారస్వామి, మజ్జిగ అశోక్, మద్దూరు మొగిలి, గాదరాబోయిన మహేందర్, మేడిపల్లి రవికుమార్, దొంతరబోయిన రవి, అమ్మ రమేష్, కందిక యాకయ్య తదితరులు పాల్గొన్నారు.


