Thursday, 10 September 2026
  • Home  
  • జేపీలో చేరిన 23, 24వ వార్డులకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు
- వరంగల్

జేపీలో చేరిన 23, 24వ వార్డులకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, నర్సంపేట నియోజకవర్గంలో బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి చేపడుతున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై నర్సంపేట పట్టణంలోని 23, 24వ వార్డులకు చెందిన పలువురు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పేదలు, రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా దేశంలోని కోట్లాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోందని తెలిపారు. అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గంలో డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటూ, ఉచిత వైద్య సేవలు, కంటి వైద్య శిబిరాలు, పేదలకు సహాయం, విద్యార్థులకు చేయూత వంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి సుత్రపు సరిత ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కాసౌజుల బ్రమ్మచారి గారి కి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం కల్పిస్తామని, ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పోరాడుతూ నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తామని అన్నారు. నర్సంపేటలో బీజేపీకి రోజురోజుకూ ప్రజల మద్దతు పెరుగుతోందని, రాబోయే రోజుల్లో మరింత మంది వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా, అభివృద్ధే ధ్యేయంగా నర్సంపేట నియోజకవర్గంలో బీజేపీని మరింత బలోపేతం చేస్తామని డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి తెలిపారు. బిజెపి పార్టీలో చేరిన వారి పేర్లు 23 వ వార్డ్ నుండి మోటూరి కాశీనాధం, వెంగపండ్ల రాకేష్,పెసరి కార్తికేయ, నాంపల్లి శ్రీనివాస్, 24 వ వార్డు నుండి మేకల రవి, కందుకూరి మహేష్ బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో…బిజెపి ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ జూలూరు రోజా రాణి ,బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డపల్లి నరసింహా రాములు, పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచందర్ రెడ్డి, నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్,రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్, నల్లబెల్లి అధ్యక్షులు తడుక వినయ్,మాజీ కౌన్సిలర్ జుర్రు రాజు,బిజెపి నియోజకవర్గ నాయకులు జూలూరు మనీష్ గౌడ్,జిల్లా కిసాన్ మోర్చా జిల్లా నాయకులు శీలం సత్యనారాయణ,బచ్చు వెంకన్న, సీనియర్ నాయకులు కుంభం కోమల్ రెడ్డి,యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్,బిజెపి మండల ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి రాము,పట్టణ నాయకులు ఠాకూర్ విజయ్ సింగ్, కాసుల నాగేంద్రబాబు, పొనుగోటి రవీంద్ర చారి తదితరులు పాల్గొన్నారు

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, నర్సంపేట నియోజకవర్గంలో బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి చేపడుతున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై నర్సంపేట పట్టణంలోని 23, 24వ వార్డులకు చెందిన పలువురు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పేదలు, రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా దేశంలోని కోట్లాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోందని తెలిపారు.
అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గంలో డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటూ, ఉచిత వైద్య సేవలు, కంటి వైద్య శిబిరాలు, పేదలకు సహాయం, విద్యార్థులకు చేయూత వంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని అన్నారు.
బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి సుత్రపు సరిత ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కాసౌజుల బ్రమ్మచారి గారి కి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం కల్పిస్తామని, ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పోరాడుతూ నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తామని అన్నారు.
నర్సంపేటలో బీజేపీకి రోజురోజుకూ ప్రజల మద్దతు పెరుగుతోందని, రాబోయే రోజుల్లో మరింత మంది వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.
ప్రజా సేవే లక్ష్యంగా, అభివృద్ధే ధ్యేయంగా నర్సంపేట నియోజకవర్గంలో బీజేపీని మరింత బలోపేతం చేస్తామని డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి తెలిపారు.
బిజెపి పార్టీలో చేరిన వారి పేర్లు 23 వ వార్డ్ నుండి
మోటూరి కాశీనాధం, వెంగపండ్ల రాకేష్,పెసరి కార్తికేయ, నాంపల్లి శ్రీనివాస్, 24 వ వార్డు నుండి మేకల రవి, కందుకూరి మహేష్ బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది
ఈ కార్యక్రమంలో…బిజెపి ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ జూలూరు రోజా రాణి ,బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డపల్లి నరసింహా రాములు, పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచందర్ రెడ్డి, నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్,రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్, నల్లబెల్లి అధ్యక్షులు తడుక వినయ్,మాజీ కౌన్సిలర్ జుర్రు రాజు,బిజెపి నియోజకవర్గ నాయకులు జూలూరు మనీష్ గౌడ్,జిల్లా కిసాన్ మోర్చా జిల్లా నాయకులు శీలం సత్యనారాయణ,బచ్చు వెంకన్న, సీనియర్ నాయకులు కుంభం కోమల్ రెడ్డి,యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్,బిజెపి మండల ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి రాము,పట్టణ నాయకులు ఠాకూర్ విజయ్ సింగ్, కాసుల నాగేంద్రబాబు, పొనుగోటి రవీంద్ర చారి తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.