Wednesday, 9 September 2026
  • Home  
  • 10 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆయుష్ వైద్య విద్యార్థులకు స్టైపెండ్ పెంపు
- హైదరాబాద్

10 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆయుష్ వైద్య విద్యార్థులకు స్టైపెండ్ పెంపు

పున్నమి న్యూస్: హైదరాబాద్, సెప్టెంబర్ 9: తెలంగాణలో ఆయుష్ హౌస్ సర్జన్లు, పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థుల స్టైపెండ్ పెంపు డిమాండ్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026 సెప్టెంబర్ 8న ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జి.ఓ.ఆర్.టి. నం.356 ను జారీ చేస్తూ ఆయుష్ సంస్థల్లోని హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైపెండ్‌ను సంబంధిత అల్లోపతి జూనియర్ డాక్టర్లు, పీజీ విద్యార్థుల స్టైపెండ్‌తో సమానంగా పెంచేందుకు అనుమతి ఇచ్చింది. హౌస్ సర్జన్లకు ఆయుర్వేద, హోమియోపతి, యునాని, నేచురోపతి విభాగాల్లో ప్రస్తుతం నెలకు రూ.13,754 గా ఉన్న స్టైపెండ్‌ను రూ.29,792 కు పెంచారు.పీజీ విద్యార్థులకు 1వ సంవత్సరం రూ.67,032, 2వ సంవత్సరం రూ.70,757, 3వ సంవత్సరం రూ.74,482 గా నిర్ణయించారు. ఈ ఉత్తర్వులకు ఆర్థిక శాఖ ఆమోదం కూడా లభించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆయుష్ డైరెక్టర్ తదుపరి అవసరమైన చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో సూచించింది. 10 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్టైపెండ్ పెంపు కోసం 28 రోజులుగా కొనసాగిన ఉద్యమం అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయుష్ విద్యార్థులు, హౌస్ సర్జన్లు, పీజీ వైద్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయుష్ విద్యార్థులు, డాక్టర్లు సచివాలయంలో ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.తమ ఐక్య పోరాటం, నాయకత్వం, మద్దతుదారుల సహకారంతో ఈ విజయం సాధ్యమైందని వారు పేర్కొన్నారు.

పున్నమి న్యూస్: హైదరాబాద్, సెప్టెంబర్ 9:
తెలంగాణలో ఆయుష్ హౌస్ సర్జన్లు, పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థుల స్టైపెండ్ పెంపు డిమాండ్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
2026 సెప్టెంబర్ 8న ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జి.ఓ.ఆర్.టి. నం.356 ను జారీ చేస్తూ ఆయుష్ సంస్థల్లోని హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైపెండ్‌ను సంబంధిత అల్లోపతి జూనియర్ డాక్టర్లు, పీజీ విద్యార్థుల స్టైపెండ్‌తో సమానంగా పెంచేందుకు అనుమతి ఇచ్చింది.
హౌస్ సర్జన్లకు ఆయుర్వేద, హోమియోపతి, యునాని, నేచురోపతి విభాగాల్లో ప్రస్తుతం నెలకు రూ.13,754 గా ఉన్న స్టైపెండ్‌ను రూ.29,792 కు పెంచారు.పీజీ విద్యార్థులకు 1వ సంవత్సరం రూ.67,032, 2వ సంవత్సరం రూ.70,757, 3వ సంవత్సరం రూ.74,482 గా నిర్ణయించారు.
ఈ ఉత్తర్వులకు ఆర్థిక శాఖ ఆమోదం కూడా లభించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆయుష్ డైరెక్టర్ తదుపరి అవసరమైన చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో సూచించింది.
10 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్టైపెండ్ పెంపు కోసం 28 రోజులుగా కొనసాగిన ఉద్యమం అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయుష్ విద్యార్థులు, హౌస్ సర్జన్లు, పీజీ వైద్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయుష్ విద్యార్థులు, డాక్టర్లు సచివాలయంలో ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.తమ ఐక్య పోరాటం, నాయకత్వం, మద్దతుదారుల సహకారంతో ఈ విజయం సాధ్యమైందని వారు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.