ఖమ్మం అర్బన్ టౌన్ బీజేపీ శక్తి కేంద్ర ఇంచార్జిల సమావేశం అధ్యక్షులు వాకా దాని రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్య నారాయణ హాజరయ్యారు. సీనియర్ నాయకులు వేల్పుల సుధాకర్, ప్రధాన కార్యదర్శి ఆచంటి కోటేశ్వరరావు, కంపసాటి అజయ్‌తో పాటు శక్తి కేంద్ర ఇంచార్జిలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.



