Tuesday, 8 September 2026
  • Home  
  • స్థానిక సంస్థ ఎన్నికల సన్నాహంపై కీలక చర్చ మంగళగిరి
- తూర్పు గోదావరి

స్థానిక సంస్థ ఎన్నికల సన్నాహంపై కీలక చర్చ మంగళగిరి

*మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం లీడర్ షిప్ కాన్క్లేవ్ – రెండో రోజు ఉత్సాహంగా కొనసాగింపురెండు రోజుల కార్యక్రమం పాల్గొన్న కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, జగ్గంపేట ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు జ్యోతుల నెహ్రూ* జగంపేట,మంగళగిరి, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 8: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలుగుదేశం లీడర్ షిప్ కాన్క్లేవ్ 7, 8 తేదీల్లో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరుగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఈ రెండు రోజుల శిక్షణ తరగతులు రెండో రోజు మరింత ఉత్సాహంగా కొనసాగాయి.రెండు రోజుల కార్యక్రమంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, జగ్గంపేట శాసనసభ్యులు , పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. పార్టీ నాయకత్వం, భవిష్యత్ కార్యాచరణపై జరిగిన చర్చల్లో చురుకుగా పాల్గొన్నారు.రెండో రోజు ముఖ్యాంశాలు: సెషన్ 6 – సుస్థిర అభివృద్ధి:* ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నమూనాలు, పీపీపీ విధానం, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, హైదరాబాద్, అమరావతి అభివృద్ధి నమూనాలపై లోతైన చర్చ జరిగింది. సెషన్ 7 – ప్రజలకు ప్రభుత్వ సేవలు, పాలనా విధానం:* స్వర్ణాంధ్ర 2047 విజన్ కు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధానాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పై వివరణ. సెషన్ 8 – రాజకీయ సమాచార ప్రచారం, ప్రజలతో అనుసంధానం:* ప్రజలతో ఓపిగ్గా, స్పష్టతతో మెలగడం, మై టీడీపీ, సోషల్ మీడియా వినియోగం, కంటెంట్ తయారీలో క్యాడర్ భాగస్వామ్యంపై శిక్షణ. సెషన్ 9 – ఎల్ నినో అవగాహన:* వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయం, రిజర్వాయర్లు, భూగర్భ జలాలపై ప్రభావం, రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల వారీగా పంటలపై ప్రభావంపై అధ్యయనం.సెషన్ 10 – స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహం:* డీలిమిటేషన్ నుంచి పోలింగ్ వరకు ఎన్నికల ప్రక్రియ, ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక, మిత్రపక్షాలతో సమన్వయం, ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టడం, పోలింగ్ రోజు సన్నద్ధతపై దిశానిర్దేశం.చివరగా ఐటీ శాఖ మంత్రి, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ముగింపు సందేశంతో కాన్క్లేవ్ విజయవంతంగా ముగిసింది.

*మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం లీడర్ షిప్ కాన్క్లేవ్ – రెండో రోజు ఉత్సాహంగా కొనసాగింపురెండు రోజుల కార్యక్రమం పాల్గొన్న కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, జగ్గంపేట ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు జ్యోతుల నెహ్రూ*

జగంపేట,మంగళగిరి, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 8:

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలుగుదేశం లీడర్ షిప్ కాన్క్లేవ్ 7, 8 తేదీల్లో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరుగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఈ రెండు రోజుల శిక్షణ తరగతులు రెండో రోజు మరింత ఉత్సాహంగా కొనసాగాయి.రెండు రోజుల కార్యక్రమంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, జగ్గంపేట శాసనసభ్యులు , పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. పార్టీ నాయకత్వం, భవిష్యత్ కార్యాచరణపై జరిగిన చర్చల్లో చురుకుగా పాల్గొన్నారు.రెండో రోజు ముఖ్యాంశాలు: సెషన్ 6 – సుస్థిర అభివృద్ధి:* ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నమూనాలు, పీపీపీ విధానం, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, హైదరాబాద్, అమరావతి అభివృద్ధి నమూనాలపై లోతైన చర్చ జరిగింది. సెషన్ 7 – ప్రజలకు ప్రభుత్వ సేవలు, పాలనా విధానం:* స్వర్ణాంధ్ర 2047 విజన్ కు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధానాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పై వివరణ. సెషన్ 8 – రాజకీయ సమాచార ప్రచారం, ప్రజలతో అనుసంధానం:* ప్రజలతో ఓపిగ్గా, స్పష్టతతో మెలగడం, మై టీడీపీ, సోషల్ మీడియా వినియోగం, కంటెంట్ తయారీలో క్యాడర్ భాగస్వామ్యంపై శిక్షణ. సెషన్ 9 – ఎల్ నినో అవగాహన:* వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయం, రిజర్వాయర్లు, భూగర్భ జలాలపై ప్రభావం, రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల వారీగా పంటలపై ప్రభావంపై అధ్యయనం.సెషన్ 10 – స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహం:* డీలిమిటేషన్ నుంచి పోలింగ్ వరకు ఎన్నికల ప్రక్రియ, ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక, మిత్రపక్షాలతో సమన్వయం, ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టడం, పోలింగ్ రోజు సన్నద్ధతపై దిశానిర్దేశం.చివరగా ఐటీ శాఖ మంత్రి, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ముగింపు సందేశంతో కాన్క్లేవ్ విజయవంతంగా ముగిసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.