గాజువాక,(పున్నమి ప్రతినిధి ),సెప్టెంబర్ 07: కూటమి ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మంజూరు చేసేందుకు గాను సచివాలయాలలో అప్లికేషన్లు స్వీకరిస్తోంది ఈ ప్రక్రియ ఈ నెల 16వ తేదీ వరకు కొనసాగుతుందని, అర్హులైన వారంతా తమ పరిధిలోని సచివాలయాలలో దరఖాస్తులు అందజేయాలని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు పులి వెంకట రమణారెడ్డి కోరారు. 75వ వార్డు పరిధిలోని సీతానగరం సచివాలయంలో అర్హులైన వారి చేత అప్లికేషన్లు అందజేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సచివాలయాలలో దరఖాస్తుల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలన్నారు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని, ప్రజలకు సహాయపడటానికి 75వ వార్డు మాజీ కార్పొరేటర్ కార్యాలయం సిబ్బంది, కూటమి నాయకులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 75వ వార్డు టీడీపీ ప్రధాన కార్యదర్శి ములకలపల్లి పెంటయ్య, కూటమి నాయకులు దొమ్మేటి నాగరాజు, వెంపాడ అప్పన్న రెడ్డి, దొమ్మేటి సోము నాయుడు, రాజు భాయ్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ