అరకులోయ మండలంలో నూతన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ సోమవారం ప్రారంభమైంది. అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర వర్గాల వారు ఈ నెల 16వ తేదీలోగా స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో వీసం ప్రసాద్ తెలిపారు. దరఖాస్తుతో ఆధార్, రైస్‌కార్డు లేదా ఆదాయ ధ్రువపత్రం సమర్పించాలని సూచించారు. పింఛన్ కేటగిరీకి అనుగుణంగా వయస్సు, భర్త మరణం, దివ్యాంగత్వం తదితర ధ్రువపత్రాలు అందజేయాలన్నారు. దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసి ఈకేవైసీ నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం అర్హత పరిశీలన, భౌతిక ధ్రువీకరణ పూర్తిచేసి ప్రభుత్వ అనుమతి, బడ్జెట్ లభ్యత మేరకు పింఛన్లు మంజూరవుతాయని పేర్కొన్నారు.

నూతన పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ : అరకు ఎంపీడీఓ