రంగారెడ్డి జిల్లా: ఎల్బీనగర్లో తెలుగు సంప్రదాయ రుచులకు ఆధునిక హంగులను జోడిస్తూ నూతనంగా ఏర్పాటు చేసిన ‘డల్లాస్‌పురం – తెలుగు కిచెన్ & బార్’ గ్రాండ్ ఓపెనింగ్ ఆదివారం ఘనంగా జరిగింది. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన ప్రారంభోత్సవ కార్యక్రమం ఆహ్వానితులు, నిర్వాహకులు, శ్రేయోభిలాషుల సందడితో ఉత్సాహభరితంగా సాగింది.
తెలుగు వంటకాల ప్రత్యేకతను, మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా డల్లాస్‌పురంను తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ తెలుగు వాతావరణాన్ని గుర్తుచేసేలా రెస్టారెంట్ రూపకల్పన చేయడంతో పాటు, సంప్రదాయ రుచులను ఆధునిక వాతావరణంలో అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రత్యేకంగా తెలుగు వంటకాలపై ఆసక్తి ఉన్నవారికి, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన సమయం గడపాలనుకునే వారికి డల్లాస్‌పురం మంచి వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆహారం నాణ్యత, రుచి, అతిథులకు అందించే సేవలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా కల్లెం రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్‌లో తెలుగు వంటకాల ప్రత్యేకతను మరింతగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో డల్లాస్‌పురంను ప్రారంభించినట్లు తెలిపారు. నగర జీవనశైలికి అనుగుణంగా సౌకర్యవంతమైన వాతావరణంతో పాటు, తెలుగు సంప్రదాయ ఆహార రుచులను అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా రెస్టారెంట్‌ను సందర్శించిన అతిథులు అక్కడి వాతావరణం, అలంకరణ, తెలుగు సంస్కృతి ప్రతిబింబించే ఏర్పాట్లను ప్రశంసించారు. నూతనంగా ప్రారంభమైన డల్లాస్‌పురం తెలుగు కిచెన్, బార్ విజయవంతంగా కొనసాగాలని, ఎల్బీనగర్లో ప్రత్యేక గుర్తింపు పొందాలని పలువురు ఆకాంక్షించారు.



