ఎం.తిరుమలరెడ్డి ఉత్సవాలకు రూ. 10 వేలు విరాళం
రామచంద్రపురం సెప్టెంబర్ 06 పున్నమి ప్రతినిధి
మండలంలోని సికె పల్లి పంచాయతీ చిట్టత్తూరు ఆది ఆంధ్ర వాడలో శ్రీ రేణుక మాత మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.. ఆదివారం ఉదయం శ్రీ మాతమ్మ ఆలయంలో ఉత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం జరిగింది. శ్రీ మాతమ్మ ఉత్సవాలకు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మేకల తిరుమలరెడ్డి, మాజీ ఎంపీపీ తానికొండ కేశవులనాయుడు, కె నరసింహారెడ్డి, మాదాసు మాధవయ్య, ఎల్ సురేంద్ర నాయుడులు హాజరై, అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాల నిర్వహించారు. అనంతరం శ్రీ రేణుక మాతమ్మ ఉత్సవాల నిర్వహణకు మేకల తిరుమలరెడ్డి మాధవి దంపతులు రూ. 10 వేల రూపాయలు విరాళంగా అందజేసి, గ్రామంలోని మహిళలందరికీ పసుపు కుంకుమ, గాజులు పంపిణీ చేశారు. అనంతరం అమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యులు టిడిపి నాయకులను దుశ్యాలువులతో సన్మానించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, బాబయ్య బక్కయ్య, గుండయ్య, హరి ప్రసాద్, నాగరత్నం స్థానిక టిడిపి నాయకులు, ప్రభాకర్, వేణుగోపాల్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.




