బస్టాండ్ ఆవరణంలో మంటలను ఆర్పిన విజిలెన్స్ విజయవాడ అధికారులు
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
నల్లజర్ల నల్లజర్ల గ్రామం లో ఏలూరు రోడ్డు లో వున్న బస్టాండ్ ఆవరణలో కొందరు వ్యాపారస్థులు మొక్కజొన్నపొత్తులు పండ్లు అమ్ముకోను వారు బస్టాండ్ ఆవరణంలో పుల్లలు పోయి పెట్టి మంటలు వేస్తూ ప్రజలకు ఆటంకంకాలు కలిగిస్తున్నారు అస్సలే ఉక్కపొతతో ఊపిరి పీల్చుకోవటానికే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అపైగా ఎల్ నీనో ప్రభావంతో వేడిమికి తట్టుకోలేక ప్రజలు నీరస్లిలి పోతున్న పరిస్థితి , అటుగా వచ్చిన విజయవాడ ఆర్ టీ సీ విజిలెన్స్ స్క్వాడ్ జి శ్రీనివాసరావు బృందం వారు తనిఖీలో అక్కడ మంటలు పెడుతూ కొంత స్థలం ఆక్రమించి అక్కడ కొన్ని షెడ్లు వేసుకుని, ప్రజలకు ఆటంకం కలిగిస్తున్న వారిని మందలించి అధికారులే స్వయంగా మంటలను అదుపుచేసారు (ఆర్పేశారు ) ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ వ్యాపారం చేసుకుంటున్న వారితో అధికారులు మాట్లాడి ఇలాంటి మంటలు ఏమి మళ్ళీ పెడితే చర్యలు తీసుకుంటామని గట్టిగా వార్ణింగ్ ఇచ్చారు . అందరు బ్రతకాలి అందరూ క్షేమంగా ఉండాలి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దు అని ఇక్కడ వున్న బస్టాండ్ ప్రాంగణం శుభ్రంగా ఉంచాలని తెలియచేసారు. అలాగే అక్కడ వున్న చెత్త చెదారం వారితో తీపించేసారు. కనుక అధికారులు స్పందించి అక్కడ ప్రజలకు ప్రయాణికులు కి తగు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. అలాగే ప్రయాణికులు కూడా అధికారులు దగ్గరకి వెళ్లి అక్కడున్న సమస్యలు తెలియచేసారు. అధికారులు న్యాయం చేస్తామని హామీఇచ్చారు. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.
