శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 03, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిలోని స్థానిక పుణ్యక్షేత్ర మహాత్మ్యమైన ‘శ్రీ’ (సాలీడు) భక్తి చరిత్రను అద్భుతమైన పాట రూపంలో మలచిన శ్రీకాళహస్తికి చెందిన సీనియర్ పాత్రికేయులు చెన్నూరు వెంకటేశులుకు తిరుపతిలో ఘన సత్కారం జరిగింది. తిరుపతికి చెందిన ప్రముఖ సంస్థ గ్రీన్ హోమ్ డెవలపర్స్ అధినేత రవిచంద్ర ఆయనను ప్రత్యేకంగా అభినందించి, శ్రీవెంకటేశ్వర స్వామివారి పవిత్ర కండువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ.. శ్రీకాళహస్తీశ్వరుడి సేవలో తరించిన సాలీడు విశిష్ట చరిత్రను, భక్తి తత్వాన్ని సమాజానికి సులభంగా అర్థమయ్యేలా పాట రూపంలో వెలుగులోకి తీసుకురావడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఇలాంటి భక్తిరస రచనలు సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్న ఆయన, ఇదే స్ఫూర్తితో కలియుగ వైకుంఠనాథుడైన శ్రీవెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని చాటిచెప్పేలా మరిన్ని భక్తి గీతాలను రచించాలని వెంకటేశులును కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని రచయితకు తమ అభినందనలు తెలియజేశారు.

శ్రీకాళహస్తి సాలీడు చరిత్రపై పాట-సీనియర్ పాత్రికేయునికి ఘన సత్కారం