* నగరంలో పరిపాటిగా మారిన అభివృద్ధి పనులు
* ముందు చూపు లేకపోవడంతోనే పదే పదే ప్రజా ధనం దుర్వినియోగం
* ఉన్నతాధికారులు ఆలోచించాల్సిన తరుణం ఆసన్నం
నెల్లూరు నగరంలో అభివృద్ధి పనుల విషయం లో అధికారులకు ముందు చూపు లేకపోవడం భవిష్యత్తు అవసరాలను అంచనా వేయకుండా అభివృద్ధి పనులు చేయడం తో ప్రజా ధనం దుర్వినియోగం అవుతుంది అనేక అభివృద్ధి పనులలో ముందు చూపు కనిపించడం లేదు . కట్టడం …పగలకొట్టడం…మల్లీ కట్టడం …పరిపాటి అయిపోయింది . దీనితో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న విమర్శలు ప్రజలనుంచి వెలువెత్తుతున్నాయి ఇలాంటి సంఘటనల పై ఉన్నతాధికారులు మనసు పెట్టి అలోచించి తగు నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నగర ప్రజలు తమభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు . ఆలా కాక దున్న ఈనింది అంటే గాట కట్టేయమన్న సామెతగా వ్యవహరిస్తే ప్రజా విమర్శల పాలవుతారని వారు చెప్తున్నారు . ప్రస్తుతం రామలింగాపురం వద్ద ముత్తుకూరు రోడ్డులో ప్రవేశించే సమీపంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఉన్న ఐలాండ్ ను కుదించి ట్రాఫిక్ జాం సమస్యలు పేరుతో రోడ్డు వెడల్పు చేస్తున్నారు .
నాలుగు లక్షల రూపాయల అంచనాలతో ఈ పనులు జరుగుతున్నాయి . అయితే గతంలో జాతీయ రహదారుల వారు ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి ని నిర్మించిన సమయంలో కింది భాగంలో బ్రిడ్జి కింద కొంత మేర అక్కడక్కడా ఐలాండ్ లు నిర్మించారు . ఈ ఐలాండ్ ల చుట్టూ సిమెంట్ కాంక్రీట్ గోడలు కట్టి మధ్యలో మట్టి పోసుకొని బ్యూటిఫికేషన్ గ్రీనరీ లను చేసుకునేందుకు వీలుగా ఒదిలి నిర్మించారు . ఇది జరిగి ఎన్నో ఏళ్ళు కాలేదు రెండు మూడు ఏళ్ల ముందే ఈ పనులు లక్షల ఖర్చుతో జరిగాయి . అయితే ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలోని రోడ్డులో ట్రాఫిక్ ఎక్కువైంది . దీనితో పాటు అక్కడ నాలుగు రోడ్ల భారీ కూడలి ఉండటం తో ట్రాఫిక్ జాం సమస్య కూడా తలెత్తింది . దీనితో రోడ్ సేఫ్టీ కమిటీ వారు ఇదంతా పరిశీలించి ఫ్లైఓవర్ బ్రిడ్జి కింది భాగంలో నిర్మించి ఉన్న కొంత మేర ఐలాండ్ ల వెడల్పును తగ్గించాలని సిఫారస్ చేసారు . ఈ మేరకు ప్రస్తుతం సిటీ నియోజకవర్గం వైపు 4 లక్షల రూపాయలతో పనులు మొదలు పెట్టారు . రెండు మూడు ఏళ్ళ నాడు జాతీయ రహదారుల వారు లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ ఐలాండ్ సిమెంట్ కాంక్రీట్ గోడలను పగులకొట్టి తీసివేసి ఐలాండ్ ను కుదించి తిరిగి సీసీ కాంక్రీట్ తో డివైడర్ ను తక్కువ వెడల్పు తో నిర్మిస్తున్నారు .
ఇది చూసిన వారు గతంలో వెడల్పుగా కట్టడం ఎందుకు మరలా ఇప్పుడు పగలకొట్టి కుదించి కట్టడం ఎందుకు ? చేసిన పనులే మల్లి మల్లి చేయడం వల్ల ప్రజా ధనం దుర్వినియోగం అవుతుంది కదా అని విమర్సిస్తున్నారు . ప్రభుత్వ ధనం జీతాల రూపం లో లక్షలు లక్షలు నెల నెల తీసుకునే అధికారులు ముందు చూపుతో అలోచించి అభివృద్ధి పనులు చేపట్టారా ? అని ప్రశ్నిస్తున్నారు ఒక ప్రధాన రోడ్ లో ఐలాండ్ నిర్మించేటప్పుడు పట్టణ ఆవశ్యకత పెరిగే జనాభా అవసరాలు వాహనాల సంఖ్య రేపటి రోజున తలెత్తే పరిణామాలు ఇలాంటి వన్నీ చూసుకొని ఆలోచించుకొని చేసి ఉండాలి కదా అని ప్రశ్నిస్తున్నారు . ప్రస్తుతం ఈ ఐలాండ్ కుదింపు పనులు ఉత్తరం వైపు సిటీ నియోజక వర్గ పరిధిలో జరుగుతుండగా త్వరలో అక్కడకి సమీపంలోని దక్షిణం వైపుగల రురల్ నియోజకవర్గ పరిధిలో జరగబోతున్నాయి మల్లి ఈ పనులకు కార్పొరేషన్ తన ప్రజాధనాన్ని కొన్ని లక్షలు ఖర్చు చేయక తప్పదు .ఆ వైపు కూడా పగలకొట్టడం మల్లి కట్టడం పనులు చేయాల్సి రావడం ఏర్పడింది .
ఇవే కాక రోడ్ సేఫ్టీ కమిటి సిఫారసులు మేరకు నగరం లో మరో ఏడు ఎనిమిది చోట్ల కూడా ఇలాంటి పనులు త్వరలో చేయబోతున్నట్లు తెలియ వస్తుంది . ఇలాంటి పనులను నగర ప్రజలు విమర్శిస్తున్నారు ట్రాఫిక్ జామ్ సమస్య వాస్తవమే రోడ్ సేఫ్టీ కమిటీ సిఫారుసులు సమంజసమే . వీటిని ఎవ్వరు తప్పు పట్టారు అయితే నాడు జాతీయ రహదారుల వారు ఇస్తా రాజ్యంగా వెడల్పు కట్టడం ప్రస్తుతం కుదించడం దరిమిలా కార్పొరేషన్ ప్రజాధనం లక్షలు ఖర్చుకావడం తదితరాలు మాత్రమే ప్రజలు తప్పు పడుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు మల్లీ మల్లీ పునరావృతం కాకుండా ఒకేసారి ముందు చూపుతో అలోచించి చర్యలు తీసుకోవాలని ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు . …

