Thursday, 10 September 2026
  • Home  
  • ఇండో–శ్రీలంక ఫ్రెండ్షిప్ కప్ విజేత తెలంగాణ
- BHADRADRI

ఇండో–శ్రీలంక ఫ్రెండ్షిప్ కప్ విజేత తెలంగాణ

నాదర్‌గుల్: నాదర్‌గుల్‌లోని AYR క్రికెట్‌ గ్రౌండ్‌లో AS Sports & Events Management ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా జరిగిన 3వ ఇండో–శ్రీలంక అండర్‌-12 ఫ్రెండ్షిప్‌ కప్–2026 టోర్నమెంట్‌ ముగిసింది. నాలుగు జట్లు పాల్గొన్న టోర్నమెంట్‌లో తెలంగాణ జట్టు విజేతగా నిలవగా, శ్రీలంక జట్టు రన్నరప్‌గా, ఎలైట్‌ ప్రో క్రికెట్‌ అకాడమీ హైదరాబాద్‌ జట్టు మూడో స్థానంలో నిలిచింది. టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు వ్యక్తిగత పురస్కారాలు అందజేశారు. ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా శ్రేయస్‌, ఉత్తమ బౌలర్లుగా అర్జున్‌రెడ్డి, రోషన్‌ నాయుడు, ఉత్తమ వికెట్‌ కీపర్‌గా ఆదర్శ్‌ అవార్డులు అందుకున్నారు. బాయ్స్‌ విభాగంలో శ్రీలంకకు చెందిన మిథున్‌, గర్ల్స్‌ విభాగంలో వాసుకి ఎమర్జింగ్‌ ప్లేయర్‌ అవార్డులు దక్కించుకున్నారు. ముగింపు కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు శ్రీరామ్‌, కార్యదర్శి చంద్ర మోహన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జయనంద్‌ పటేల్‌, సన్నీ, శేఖర్‌, శ్రీలంక కోచ్‌ నెవెల్‌, ఆర్గనైజింగ్‌ కమిటీ సభ్యులు పవన్‌, సతీష్‌, ఆరిఫ్‌, ప్రశాంత్‌, ఆనంద్‌ పాల్గొన్నారు. టోర్నమెంట్‌లో పాల్గొన్న క్రీడాకారులందరికీ SS MPE Sports Pvt. Ltd. తరఫున మెమెంటోలు అందజేశారు. భారత్‌–శ్రీలంక మధ్య స్నేహ సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు చిన్నారుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా టోర్నమెంట్‌ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

నాదర్‌గుల్: నాదర్‌గుల్‌లోని AYR క్రికెట్‌ గ్రౌండ్‌లో AS Sports & Events Management ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా జరిగిన 3వ ఇండో–శ్రీలంక అండర్‌-12 ఫ్రెండ్షిప్‌ కప్–2026 టోర్నమెంట్‌ ముగిసింది. నాలుగు జట్లు పాల్గొన్న టోర్నమెంట్‌లో తెలంగాణ జట్టు విజేతగా నిలవగా, శ్రీలంక జట్టు రన్నరప్‌గా, ఎలైట్‌ ప్రో క్రికెట్‌ అకాడమీ హైదరాబాద్‌ జట్టు మూడో స్థానంలో నిలిచింది. టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు వ్యక్తిగత పురస్కారాలు అందజేశారు. ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా శ్రేయస్‌, ఉత్తమ బౌలర్లుగా అర్జున్‌రెడ్డి, రోషన్‌ నాయుడు, ఉత్తమ వికెట్‌ కీపర్‌గా ఆదర్శ్‌ అవార్డులు అందుకున్నారు. బాయ్స్‌ విభాగంలో శ్రీలంకకు చెందిన మిథున్‌, గర్ల్స్‌ విభాగంలో వాసుకి ఎమర్జింగ్‌ ప్లేయర్‌ అవార్డులు దక్కించుకున్నారు.
ముగింపు కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు శ్రీరామ్‌, కార్యదర్శి చంద్ర మోహన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జయనంద్‌ పటేల్‌, సన్నీ, శేఖర్‌, శ్రీలంక కోచ్‌ నెవెల్‌, ఆర్గనైజింగ్‌ కమిటీ సభ్యులు పవన్‌, సతీష్‌, ఆరిఫ్‌, ప్రశాంత్‌, ఆనంద్‌ పాల్గొన్నారు.
టోర్నమెంట్‌లో పాల్గొన్న క్రీడాకారులందరికీ SS MPE Sports Pvt. Ltd. తరఫున మెమెంటోలు అందజేశారు. భారత్‌–శ్రీలంక మధ్య స్నేహ సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు చిన్నారుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా టోర్నమెంట్‌ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.