వార్త ముఖ్యాంశాలు
- *దొరవారిసత్రం, ఆగస్టు 29:* తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డి పాలెం గ్రామంలో విద్యుత్ స్తంభంపై వేలాడుతున్న వైర్లు ప్రమాదానికి ఆహ్వానం పలుకుతున్నాయి.
- తీగలు చిందరవందరగా ఉండి తరచూ షార్ట్ సర్క్యూట్ అవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా తమ ఏరియాను పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
*దొరవారిసత్రం, ఆగస్టు 29:*
తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డి పాలెం గ్రామంలో విద్యుత్ స్తంభంపై వేలాడుతున్న వైర్లు ప్రమాదానికి ఆహ్వానం పలుకుతున్నాయి. తీగలు చిందరవందరగా ఉండి తరచూ షార్ట్ సర్క్యూట్ అవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా తమ ఏరియాను పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనలో ఉన్నామని తెలిపారు. వర్షం వస్తే మరింత ప్రమాదం ఉందని, వెంటనే వైర్లను సరిచేసి ప్రమాదాన్ని నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.