భద్రాద్రి కొత్తగూడెం:- పున్నమి న్యూస్ చుంచుపల్లి మండలం 28/08/2026
కొత్తగూడెం:అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శిగా కామ్రేడ్ SK ఖయ్యూం రెండవసారి ఎన్నిక కావడం ఎంతో హర్షించదగ్గ విషయం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేస్తూ, యువత సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తూ, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ పోరాటాలు నిర్వహించారు.
అదేవిధంగా యువజన ఉపాధి హక్కుల కోసం, విద్యార్థుల హక్కుల కోసం, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు. యువతను ఐక్యం చేస్తూ, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో ముందుండి పనిచేశారు.
పేదలు, కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటం చేయడం, ప్రజల పక్షాన నిలబడటం, ఉద్యమాల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ఆయనకు యువతలో మంచి గుర్తింపును తీసుకొచ్చింది.
ఆయన చేసిన నిరంతర ప్రజా ఉద్యమాలకు, యువజన సమస్యలపై చూపిన నిబద్ధతకు గుర్తింపుగా రెండవసారి జిల్లా సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆయనపై సహచరులు, యువత ఉంచిన నమ్మకానికి నిదర్శనం.
రాబోయే కాలంలో కూడా యువతకు ఉపాధి–ఉద్యోగాలు, విద్యార్థులకు విద్యా హక్కులు, సామాజిక న్యాయం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరింత ఉత్సాహంతో ఉద్యమాలు కొనసాగిస్తూ AIYFను జిల్లాలో మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షిస్తున్నాం.
కామ్రేడ్ SK.ఖయ్యూం కి మరోసారి AIYF కొత్తగూడెం మండల సమితి పక్షాన హృదయపూర్వక అభినందనలు మరియు విప్లవ శుభాకాంక్షలు.
