Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

స్వర్గీయ చెక్కపల్లి సత్యనారాయణ 70వ జయంతి సందర్భంగా అన్న క్యాంటీన్లో అన్నదానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
స్వర్గీయ చెక్కపల్లి సత్యనారాయణ 70వ జయంతి సందర్భంగా అన్న క్యాంటీన్లో అన్నదానం

వార్త ముఖ్యాంశాలు

  • *స్వర్గీయ చక్కపల్లి సత్యనారాయణ 70వ జయంతి సందర్భంగా అన్న క్యాంటీన్ లో అన్నదానం* అన్నా క్యాంటీన్ లో భోజన నాణ్యత పై ప్రజలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కోడలు లక్ష్మీదేవి* *కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 27:* స్థానిక గోకవరం రోడ్…
  • ముఖ్యంగా ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పునరుద్ధరించడం వల్ల పేదల కడుపులు నిండుతున్నాయని అన్నారు.
  • ఎవరైనా ఇంట్లో కుటుంబ సభ్యుల పెళ్లిరోజు, పుట్టినరోజుతో పాటు పెద్దల పేర్లపై అన్నదానం నిర్వహించాలని పిలుపునిచ్చారు.

*స్వర్గీయ చక్కపల్లి సత్యనారాయణ 70వ జయంతి సందర్భంగా అన్న క్యాంటీన్ లో అన్నదానం*
అన్నా క్యాంటీన్ లో భోజన నాణ్యత పై ప్రజలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కోడలు లక్ష్మీదేవి*

*కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 27:*

స్థానిక గోకవరం రోడ్ లోని ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ లో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ మామగారు చక్కపల్లి సత్యనారాయణ 70వ జయంతి పురస్కరించుకుని వారి కుమార్తె జ్యోతుల లక్ష్మీదేవి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై అన్నా క్యాంటీన్ లో భోజనాలు చేస్తున్న ప్రజలను పలకరిస్తూ భోజన నాణ్యత, రుచి ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.అనంతరం అన్నదాత లక్ష్మీదేవి మాట్లాడుతూ, మా నాన్న సత్యనారాయణ 70వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆయన జయంతి, వర్ధంతి సందర్భాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటామని అన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పునరుద్ధరించడం వల్ల పేదల కడుపులు నిండుతున్నాయని అన్నారు. ఎవరైనా ఇంట్లో కుటుంబ సభ్యుల పెళ్లిరోజు, పుట్టినరోజుతో పాటు పెద్దల పేర్లపై అన్నదానం నిర్వహించాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ప్రతిపక్షంలో ఉండగా జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఐదు సంవత్సరాల పాటు ఉచిత అన్నా క్యాంటీన్ నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను ఈ సందర్భంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, పాండ్రంగి రాంబాబు, పాలచర్ల నాగేంద్ర చౌదరి, వేములకొండ జోగారావు, వైభోగుల కొండబాబు యాదవ్, గల్లా రాము, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *