Wednesday, 23 September 2026
  • Home  
  • ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు
- BHADRADRI

ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు

కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 26:(పున్నమి ప్రతినిధి ):: రామవరం అటవీ రేంజ్ పరిధిలోని పెనగడప సెక్షన్, సత్యంపేట బీట్, కంపార్ట్‌మెంట్ నం. 19లో అడవి ఎలుగుబంటి దాడి ఘటన చోటుచేసుకుంది. సత్యంపేట బీట్ పరిధిలోని సండ్రకుంట గ్రామ సరిహద్దు ప్రాంతంలో ఉన్న జగ్గారం గోత్తికోయ నివాస ప్రాంతానికి చెందిన మడకం సింగయ్య, తండ్రి దేవయ్యపై అడవి ఎలుగుబంటి దాడి చేసినట్లు సమాచారం అందింది. ఘటనపై సమాచారం అందిన వెంటనే రామవరం రేంజ్ అటవీ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తమై ఎటువంటి ఆలస్యం చేయకుండా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన మడకం సింగయ్యకు తక్షణ సహాయం అందించి, అవసరమైన ప్రాథమిక చర్యలు చేపట్టి సురక్షితంగా కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యులు బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే ఎలుగుబంటి దాడి కారణంగా ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో మరింత ప్రత్యేక వైద్య చికిత్స అవసరమని వైద్యులు సూచించారు. దీంతో బాధితుడిని మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రిఫర్ చేశారు. తదుపరి వైద్య చికిత్సలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బాధితుడిని వరంగల్‌కు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లను అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో చేపట్టారు. బాధితుడి వెంట బీట్ అధికారులు రాము మరియు రమేష్ వెళ్లారు..

కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 26:(పున్నమి ప్రతినిధి )::
రామవరం అటవీ రేంజ్ పరిధిలోని పెనగడప సెక్షన్, సత్యంపేట బీట్, కంపార్ట్‌మెంట్ నం. 19లో అడవి ఎలుగుబంటి దాడి ఘటన చోటుచేసుకుంది. సత్యంపేట బీట్ పరిధిలోని సండ్రకుంట గ్రామ సరిహద్దు ప్రాంతంలో ఉన్న జగ్గారం గోత్తికోయ నివాస ప్రాంతానికి చెందిన మడకం సింగయ్య, తండ్రి దేవయ్యపై అడవి ఎలుగుబంటి దాడి చేసినట్లు సమాచారం అందింది.

ఘటనపై సమాచారం అందిన వెంటనే రామవరం రేంజ్ అటవీ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తమై ఎటువంటి ఆలస్యం చేయకుండా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన మడకం సింగయ్యకు తక్షణ సహాయం అందించి, అవసరమైన ప్రాథమిక చర్యలు చేపట్టి సురక్షితంగా కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.

కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యులు బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే ఎలుగుబంటి దాడి కారణంగా ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో మరింత ప్రత్యేక వైద్య చికిత్స అవసరమని వైద్యులు సూచించారు. దీంతో బాధితుడిని మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రిఫర్ చేశారు. తదుపరి వైద్య చికిత్సలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బాధితుడిని వరంగల్‌కు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లను అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో చేపట్టారు. బాధితుడి వెంట బీట్ అధికారులు రాము మరియు రమేష్ వెళ్లారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.