YR జూనియర్ కాలేజ్ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా
వింజమూరు పట్టణంలోని YR జూనియర్ కాలేజ్ 50 ఏళ్ల విద్యా ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి, పద్మ విభూషణ్ ముప్పవరపు వెంకయ్య నాయుడు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. కళాశాల అభివృద్ధికి ఎంపీ రూ.10 లక్షలు, వెంకయ్య నాయుడు తన రెండు నెలల పెన్షన్ నుంచి రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించారు. రాజా సత్యనారాయణ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో లక్ష్యాలను సాధించాలని సూచించారు. పల్లె నుంచి పద్మ విభూషణ్ వరకు వెంకయ్య నాయుడు ప్రస్థానం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

YR జూనియర్ కాలేజ్ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా
YR జూనియర్ కాలేజ్ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా వింజమూరు పట్టణంలోని YR జూనియర్ కాలేజ్ 50 ఏళ్ల విద్యా ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి, పద్మ విభూషణ్ ముప్పవరపు వెంకయ్య నాయుడు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. కళాశాల అభివృద్ధికి ఎంపీ రూ.10 లక్షలు, వెంకయ్య నాయుడు తన రెండు నెలల పెన్షన్ నుంచి రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించారు. రాజా సత్యనారాయణ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో లక్ష్యాలను సాధించాలని సూచించారు. పల్లె నుంచి పద్మ విభూషణ్ వరకు వెంకయ్య నాయుడు ప్రస్థానం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

