విశాఖపట్నం, ఆగస్టు 24: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (PGRS) కార్యక్రమంలో జీవీఎంసీ లో అన్ని విభాగాలకు కలిపి 105 వినతులు స్వీకరించామని జీవీఎంసీ అదనపు కమిషనర్లు ఎస్.ఎస్.వర్మ,డి.వి.రమణమూర్తి పేర్కొన్నారు. సోమవారం వారు జివిఎంసి ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు వారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న“ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమానికి జివిఎంసికి సంబంధించి 105 అర్జీలు / ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. అందులో ముఖ్యంగా భీమిలి జోన్ కు 01, మధురవాడ జోన్ కు 18, ఈస్ట్ జోన్ కు 17, వెస్ట్ జోన్ కు 04, నార్త్ జోనుకు 10, సౌత్ జోన్ కు 12, పెందుర్తి జోన్ కు 09, అగనంపూడి జోన్ కు 04, గాజువాక జోన్ కు 10, అనకాపల్లి జోన్ కు 02, జివిఎంసి ప్రధాన కార్యాలయానికి 18 ఫిర్యాదులు అందాయని తెలిపారు. జోనల్ అడ్మినిస్ట్రేషన్ కు 01, జివిఎంసి అడ్మినిస్ట్రేషన్ & అకౌంట్సు విభాగమునకు 03, రెవెన్యూ విభాగమునకు 10, ప్రజారోగ్య విభాగమునకు 05, పట్టణ ప్రణాళిక విభాగమునకు 49, ఇంజినీరింగు విభాగమునకు 26, డిడిహెచ్ విభాగమునకు 03, యుసిడి విభాగమునకు 08 కలిపి మొత్తంగా 105 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.
ఫిర్యాదులకు సంబంధించిన విభాగాధిపతులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను/ ఫిర్యాదులను అదే రోజు జోనల్ స్థాయి అధికారులు వెంటనే పరిశీలిస్తూ, సంబంధిత ఫిర్యాదు దారులతో సంప్రదించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, వచ్చిన అర్జీలపై అధికారులు వెంటనే స్పందించి కార్యాచరణ అదే రోజు చేపట్టాలని, ప్రతివారం అదే ఫిర్యాదులు తిరిగి ప్రజలు సమర్పించకుండా ఆయా సమస్యలను నిర్ణీత సమయం లో పరిష్కరించాలని జివిఎంసి జోనల్ కమీషనర్లను, అధికారులను అదరపు కమిషనర్లు ఆదేశించారు.
పురమిత్ర, PGRSలో నమోదైన పిర్యాదులను కూడా అధికంగా పెండింగ్ లో ఉన్నాయని వాటిని పరిశీలించాలన్నారు. జోనల్ కమీషనర్ లు, జోనల్ అధికారులు నిత్యం మధ్యాహ్నం 3 నుండి 5 వరకు కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ (అమృత్) డి.విజయ భారతి, అదనపు కమిషనర్ పి.నల్లనయ్య, ప్రధాన ఇంజనీర్ పి.వి.వి.సత్యనారాయణ రాజు, డి సి ఆర్ ఎస్.శ్రీనివాసరావు, సీసీపీ ఏ.ప్రభాకరరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ.ఎన్.వి నరేష్ కుమార్, ప్రాజెక్ట్ డైరెక్టర్ (యుసిడి) బి.వి.రమణ, ఎగ్జామినర్ ఆఫ్ ఎకౌంట్స్ సి.వాసుదేవ రెడ్డి, పర్యవేక్షక ఇంజనీర్లు, సిటీ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ కుమార్, యుసిడి పి.ఒ – పి.ప్రసన్న వాణి, డిపిఒ లు జి.నాగార్జునరావు, శాంత కుమారి, డిసిపి లు, ఎసిపి లు, బయాలజిస్ట్ సాంబమూర్తి, స్టాటిస్టికల్ అధికారి పి డి వి ప్రసాద్, డిడిహెచ్ వాసుకి, ఎకౌంట్స్ ఆఫీసర్ నారాయణరావు అన్ని విభాగాల సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.

