జూలూరుపాడు:/ఖమ్మం
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు శ్రీ జటోత్ హుస్సేన్ నాయక్ అధికారిక పర్యటన నిమిత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్తున్న సందర్భంగా ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని జూలూరుపాడు మండలంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా గిరిజన మోర్చా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూక్య శ్యాం సుందర్ నాయక్, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరు రమేష్, ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు జాటోత్ మధు నాయక్ తదితరులు జటోత్ హుస్సేన్ నాయక్‌కు స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



