Monday, 24 August 2026
  • Home  
  • జైఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన గాయత్రి నృత్య అకాడమీ బృందాన్ని అభినందించిన మంత్రి సుభాష్
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

జైఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన గాయత్రి నృత్య అకాడమీ బృందాన్ని అభినందించిన మంత్రి సుభాష్

రామచంద్రపురం నియోజకవర్గం కకె .గంగవరం మండలానికి చెందిన గాయత్రి నృత్య అకాడమీ కొరియోగ్రాఫర్ కొల్లి గాయత్రి జై ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బెస్ట్ కొరియోగ్రాఫర్గా గుర్తింపు పొందడం, ఆమె శిక్షణలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రికార్డు ప్రదర్శనలో భాగస్వాములు కావడం ఎంతో గర్వకారణమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ప్రముఖ కళా సాంస్కృతిక సంస్థ మయూరి ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా 80 నిమిషాల వ్యవధిలో 30 దేశభక్తి గీతాలపై నృత్య ప్రదర్శన చేసి జై ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన గాయత్రి నృత్య అకాడమీ బృందం ఆదివారం మంత్రి సుభాష్‌ను, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యంను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా కొరియోగ్రాఫర్ కె. గాయత్రితో పాటు విద్యార్థులు సి. దుర్గ రేణుక, వి. లక్ష్మీ సాహిత్య, పీ.హెచ్.ఎస్. జ్యోత్స్న, కె. భవ్యశ్రీ, పి. హర్షిణి, రెడ్డి బాల త్రిపురసుందరి, పి. లాస్యశ్రీ, పి. అక్షిత, ఆర్. భాగ్యశ్రీ, ఎన్. బాన్వీశ్రీ, ఎం. షణ్ముఖ లక్ష్మీశ్రీ, ఎం. చరిష్మా సూర్యశ్రీలు పాల్గొన్నారు. వీరందరినీ మంత్రి సుభాష్ ప్రత్యేకంగా అభినందిస్తూ, దేశభక్తి గేయాలకు నృత్య రూపకాలు ప్రదర్శించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమన్నారు. చిన్న వయసులోనే ప్రతిభను చాటుతూ రామచంద్రపురం నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావడం ప్రశంసనీయమని కొనియాడారు. కళలకు అంకితభావంతో మరింత సాధన చేసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కొరియోగ్రాఫర్ కె. గాయత్రి, విద్యార్థుల బృందానికి మంత్రి సుభాష్, వాసంశెట్టి సత్యం శుభాకాంక్షలు తెలిపారు.

రామచంద్రపురం నియోజకవర్గం కకె .గంగవరం మండలానికి చెందిన గాయత్రి నృత్య అకాడమీ కొరియోగ్రాఫర్ కొల్లి గాయత్రి జై ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బెస్ట్ కొరియోగ్రాఫర్గా గుర్తింపు పొందడం, ఆమె శిక్షణలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రికార్డు ప్రదర్శనలో భాగస్వాములు కావడం ఎంతో గర్వకారణమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ప్రముఖ కళా సాంస్కృతిక సంస్థ మయూరి ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా 80 నిమిషాల వ్యవధిలో 30 దేశభక్తి గీతాలపై నృత్య ప్రదర్శన చేసి జై ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన గాయత్రి నృత్య అకాడమీ బృందం ఆదివారం మంత్రి సుభాష్‌ను, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యంను మర్యాదపూర్వకంగా కలిసింది.

ఈ సందర్భంగా కొరియోగ్రాఫర్ కె. గాయత్రితో పాటు విద్యార్థులు సి. దుర్గ రేణుక, వి. లక్ష్మీ సాహిత్య, పీ.హెచ్.ఎస్. జ్యోత్స్న, కె. భవ్యశ్రీ, పి. హర్షిణి, రెడ్డి బాల త్రిపురసుందరి, పి. లాస్యశ్రీ, పి. అక్షిత, ఆర్. భాగ్యశ్రీ, ఎన్. బాన్వీశ్రీ, ఎం. షణ్ముఖ లక్ష్మీశ్రీ, ఎం. చరిష్మా సూర్యశ్రీలు పాల్గొన్నారు.
వీరందరినీ మంత్రి సుభాష్ ప్రత్యేకంగా అభినందిస్తూ, దేశభక్తి గేయాలకు నృత్య రూపకాలు ప్రదర్శించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమన్నారు. చిన్న వయసులోనే ప్రతిభను చాటుతూ రామచంద్రపురం నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావడం ప్రశంసనీయమని కొనియాడారు.

కళలకు అంకితభావంతో మరింత సాధన చేసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కొరియోగ్రాఫర్ కె. గాయత్రి, విద్యార్థుల బృందానికి మంత్రి సుభాష్, వాసంశెట్టి సత్యం శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.