శ్రీ కాళహస్తి, ఆగస్టు 20, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల క్షేమాన్ని, ముత్తైదువుల సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని పరకామణి మండపంలో (రూ. 500 రాహు-కేతు పూజా మండపం వెనుక) శ్రావణ శుక్రవారం (ఆగస్టు 21) నాడు “సామూహిక శ్రావణ వరలక్ష్మీ వ్రత మహోత్సవం” అత్యంత వైభవంగా నిర్వహించబడుతోందని ఆలయ చైర్మన్ కొట్టే సాయి తెలిపారు. ఈ పవిత్ర వ్రతాన్ని ఉదయం 8:00 గంటలకు మొదటి విడతగా, ఉదయం 9:00 గంటలకు రెండవ విడతగా అర్చకులు భక్తిశ్రద్ధలతో జరిపించనున్నారు. జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి, వరలక్ష్మీ దేవి అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుతూ మహిళలందరూ ఈ పవిత్ర కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ చైర్మన్ కోరారు.

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నేడు సామూహిక శ్రావణ వరలక్ష్మీ వ్రత మహోత్సవం