Monday, 24 August 2026
  • Home  
  • రైతులే ఈ-పంట నమోదు చేసుకునే అవకాశం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రైతులే ఈ-పంట నమోదు చేసుకునే అవకాశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆదేశాలకు అనుగుణంగా రైతులందరూ తమ పంట వివరాలను స్వయంగా నమోదు చేసుకునేందుకు ఈ-పంట యాప్ ద్వారా ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని కాట్రేనికోన మండల వ్యవసాయశాఖధికారి బి.మృదుల తెలిపారు. రైతులు వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏపీవీఏఎంఎస్ 2.0 ఫార్మర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, అందులో తమ సాగు వివరాలను నమోదు చేసి, ధృవీకరించుకోవాలని మృదుల వివరించారు. ఈ యాప్‌లో నమోదు చేసే సమయానికి పంటకు కనీసం 30 రోజుల వయస్సు నిండి ఉండాలని, రైతులు నమోదు చేసిన వివరాలను తదుపరి ఆమోదం కొరకు సంబంధిత రైతు సేవా కేంద్రం సహాయకుని లాగిన్‌కు పంపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అధికారులు ఈ వివరాలను పరిశీలించి ఆమోదించిన తర్వాత, రైతులు తమ పంట సమాచారాన్ని స్వయంగా యాప్‌లోనే సరిచూసుకోవచ్చని తెలిపారు. భవిష్యత్తులో ప్రభుత్వం అందించే ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ రుణాలు, కనీస మద్దతు ధర మరియు ఇన్-పుట్ సబ్సిడీ వంటి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు, రాయితీలు పొందడానికి ఈ డిజిటల్ ఈ-పంట నమోదు అత్యంత కీలకమని, కాబట్టి మండల పరిధిలోని రైతులందరూ తప్పనిసరిగా గడువులోగా తమ పంటలను నమోదు చేయించుకోవాలని వ్యవసాయాధికారి బి. మృదుల కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.