జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సస్పెన్షన్ వేటు
బ్రేకింగ్ న్యూస్ | హైదరాబాద్
ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశాలు జారీ చేసింది.
కులాల పేరుతో పలువురిని దూషించిన ఘటనకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభాకర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు జారీ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ పరిణామం ఎల్బీనగర్ కాంగ్రెస్‌లో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కులాల పేరుతో దూషణల ఆరోపణలు..
క్రమశిక్షణ కమిటీ చర్యలు..
ఎల్బీనగర్ కాంగ్రెస్‌లో కలకలం!



