Monday, 21 September 2026
  • Home  
  • తాగడానికి నీళ్లు లేవు.. వెళ్లడానికి టాయిలెట్లు లేవు..! ఇదేనా పర్మిట్ రూమ్‌?
- రంగారెడ్డి

తాగడానికి నీళ్లు లేవు.. వెళ్లడానికి టాయిలెట్లు లేవు..! ఇదేనా పర్మిట్ రూమ్‌?

తాగడానికి నీళ్లు లేవు.. వెళ్లడానికి టాయిలెట్లు లేవు..! ఇదేనా పర్మిట్ రూమ్‌? పర్మిట్ రూమ్‌ పేరుతో ‘అసౌకర్యాల’ అడ్డా..! టాయిలెట్లు లేవు.. నీళ్లు లేవు.. అనుమతులు మాత్రం వచ్చాయా? నిబంధనలు గాలికి.. పర్మిట్ రూమ్‌ యథేచ్ఛగా..! పర్మిట్‌ రూమ్‌లో పారిశుద్ధ్యానికి పాతర..! టాయిలెట్లు లేవు.. తాగునీరు లేదు.. ప్రహరీ లేదు..! ఎనిమిది నెలలైనా ట్రేడ్‌ లైసెన్స్‌ లేదా? అనుమతులపై స్థానికుల ప్రశ్నలు మంచాల మండలం: పారిశుద్ధ్యం ప్రతి గ్రామాభివృద్ధిలో కీలకమైన అంశం. బహిరంగ మలమూత్ర విసర్జన వల్ల పరిసరాలు కలుషితమై ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. విరేచనాలు, కలరా, టైఫాయిడ్‌, పోలియో, పేగు సంబంధిత వ్యాధులు, పరాన్నజీవుల వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. గ్రామపంచాయతీల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ, బహిరంగ మలవిసర్జన నిర్మూలనకు పలు చర్యలు చేపడుతోంది. అయితే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర వైన్స్‌కు అనుబంధంగా కొనసాగుతున్న పర్మిట్‌ రూమ్‌ నిర్వహణపై స్థానికులు పలు ఆరోపణలు చేస్తున్నారు. వినియోగదారులకు కనీస పారిశుద్ధ్య, తాగునీటి సౌకర్యాలు కల్పించకుండా నిర్వహిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. టాయిలెట్లు లేక బహిరంగ మలమూత్ర విసర్జన పర్మిట్‌ రూమ్‌లో మహిళలకు, పురుషులకు ప్రత్యేక టాయిలెట్లు, యూరినల్స్‌, వాష్‌బేసిన్లు, నిరంతర తాగునీటి సౌకర్యం వంటి కనీస వసతులు ఉండాల్సి ఉన్నప్పటికీ ఇక్కడ అవి అందుబాటులో లేవని స్థానికులు చెబుతున్నారు. దీంతో కొందరు వినియోగదారులు పరిసర ప్రాంతాల్లోనే బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో పరిసరాల్లో దుర్వాసన, అపరిశుభ్రత నెలకొంటోందని, ఈగలు, దోమలు పెరిగి ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఒకవైపు బహిరంగ మలవిసర్జన నిర్మూలనకు చర్యలు చేపడుతుంటే.. మరోవైపు ఇలాంటి పరిస్థితులు కొనసాగడంపై వారు ప్రశ్నిస్తున్నారు. సర్పంచ్‌.. పంచాయతీ అధికారుల పర్యవేక్షణ ఏది? సర్పంచ్ ఉన్నట్టా లేనట్ట గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో గ్రామపంచాయతీ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. వివిధ శాఖల సమన్వయంతో పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. కానీ మంచాల మండల కేంద్రంలో పర్మిట్‌ రూమ్‌ పరిసరాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నా గ్రామపంచాయతీ పాలకవర్గం, అధికారులు ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారా? పారిశుద్ధ్య పరిస్థితులపై చర్యలు తీసుకున్నారా? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రహరీ లేకపోవడంపైనా అనుమానాలు వైన్స్‌ ప్రాంగణానికి సరైన ప్రహరీ లేకపోవడంపైనా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కనీస భద్రత, పారిశుద్ధ్య ప్రమాణాలు పాటించని పరిస్థితుల్లో పర్మిట్‌ రూమ్‌కు అనుమతులు ఎలా లభించాయనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు ఇచ్చే ముందు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారా? లేక కేవలం పత్రాల ఆధారంగానే అనుమతులు ఇచ్చారా? అని నిలదీస్తున్నారు. ఎనిమిది నెలలైనా ట్రేడ్‌ లైసెన్స్‌ లేదా? వైన్స్‌ ప్రారంభమై సుమారు ఎనిమిది నెలలు గడిచినప్పటికీ ట్రేడ్‌ లైసెన్స్‌ జారీ కాలేదనే ఆరోపణలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు నిజమైతే ఇంతకాలం గ్రామపంచాయతీ అధికారులు ఎందుకు స్పందించలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిబంధనలకు అనుగుణంగా లైసెన్స్‌ ఉందా? పర్మిట్‌ రూమ్‌ నిర్వహణకు అవసరమైన అనుమతులు పూర్తిగా ఉన్నాయా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. అధికారుల సంయుక్త తనిఖీలు చేపట్టాలి పర్మిట్‌ రూమ్‌ అనుమతులు, ట్రేడ్‌ లైసెన్స్‌, టాయిలెట్లు, తాగునీరు, వాష్‌బేసిన్లు, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రహరీ, భద్రతా ప్రమాణాలపై ఎక్సైజ్‌, గ్రామపంచాయతీ, ఆరోగ్యశాఖ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలను అధికారులు నిర్లక్ష్యం చేయరాదని అంటున్నారు. పర్మిట్‌ రూమ్‌ నిర్వహణపై వస్తున్న ఆరోపణలు నిజమేనా? నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఉన్నాయా? ట్రేడ్‌ లైసెన్స్‌ జారీ అయిందా? అనే అంశాలపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.

తాగడానికి నీళ్లు లేవు.. వెళ్లడానికి టాయిలెట్లు లేవు..! ఇదేనా పర్మిట్ రూమ్‌?

పర్మిట్ రూమ్‌ పేరుతో ‘అసౌకర్యాల’ అడ్డా..!
టాయిలెట్లు లేవు.. నీళ్లు లేవు.. అనుమతులు మాత్రం వచ్చాయా?

నిబంధనలు గాలికి.. పర్మిట్ రూమ్‌ యథేచ్ఛగా..!

పర్మిట్‌ రూమ్‌లో పారిశుద్ధ్యానికి పాతర..!

టాయిలెట్లు లేవు.. తాగునీరు లేదు.. ప్రహరీ లేదు..!

ఎనిమిది నెలలైనా ట్రేడ్‌ లైసెన్స్‌ లేదా? అనుమతులపై స్థానికుల ప్రశ్నలు

మంచాల మండలం: పారిశుద్ధ్యం ప్రతి గ్రామాభివృద్ధిలో కీలకమైన అంశం. బహిరంగ మలమూత్ర విసర్జన వల్ల పరిసరాలు కలుషితమై ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. విరేచనాలు, కలరా, టైఫాయిడ్‌, పోలియో, పేగు సంబంధిత వ్యాధులు, పరాన్నజీవుల వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. గ్రామపంచాయతీల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ, బహిరంగ మలవిసర్జన నిర్మూలనకు పలు చర్యలు చేపడుతోంది.

అయితే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర వైన్స్‌కు అనుబంధంగా కొనసాగుతున్న పర్మిట్‌ రూమ్‌ నిర్వహణపై స్థానికులు పలు ఆరోపణలు చేస్తున్నారు. వినియోగదారులకు కనీస పారిశుద్ధ్య, తాగునీటి సౌకర్యాలు కల్పించకుండా నిర్వహిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

టాయిలెట్లు లేక బహిరంగ మలమూత్ర విసర్జన

పర్మిట్‌ రూమ్‌లో మహిళలకు, పురుషులకు ప్రత్యేక టాయిలెట్లు, యూరినల్స్‌, వాష్‌బేసిన్లు, నిరంతర తాగునీటి సౌకర్యం వంటి కనీస వసతులు ఉండాల్సి ఉన్నప్పటికీ ఇక్కడ అవి అందుబాటులో లేవని స్థానికులు చెబుతున్నారు. దీంతో కొందరు వినియోగదారులు పరిసర ప్రాంతాల్లోనే బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

దీంతో పరిసరాల్లో దుర్వాసన, అపరిశుభ్రత నెలకొంటోందని, ఈగలు, దోమలు పెరిగి ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఒకవైపు బహిరంగ మలవిసర్జన నిర్మూలనకు చర్యలు చేపడుతుంటే.. మరోవైపు ఇలాంటి పరిస్థితులు కొనసాగడంపై వారు ప్రశ్నిస్తున్నారు.

సర్పంచ్‌.. పంచాయతీ అధికారుల పర్యవేక్షణ ఏది?
సర్పంచ్ ఉన్నట్టా లేనట్ట

గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో గ్రామపంచాయతీ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. వివిధ శాఖల సమన్వయంతో పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. కానీ మంచాల మండల కేంద్రంలో పర్మిట్‌ రూమ్‌ పరిసరాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నా గ్రామపంచాయతీ పాలకవర్గం, అధికారులు ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారా? పారిశుద్ధ్య పరిస్థితులపై చర్యలు తీసుకున్నారా? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.

ప్రహరీ లేకపోవడంపైనా అనుమానాలు

వైన్స్‌ ప్రాంగణానికి సరైన ప్రహరీ లేకపోవడంపైనా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కనీస భద్రత, పారిశుద్ధ్య ప్రమాణాలు పాటించని పరిస్థితుల్లో పర్మిట్‌ రూమ్‌కు అనుమతులు ఎలా లభించాయనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు ఇచ్చే ముందు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారా? లేక కేవలం పత్రాల ఆధారంగానే అనుమతులు ఇచ్చారా? అని నిలదీస్తున్నారు.

ఎనిమిది నెలలైనా ట్రేడ్‌ లైసెన్స్‌ లేదా?

వైన్స్‌ ప్రారంభమై సుమారు ఎనిమిది నెలలు గడిచినప్పటికీ ట్రేడ్‌ లైసెన్స్‌ జారీ కాలేదనే ఆరోపణలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు నిజమైతే ఇంతకాలం గ్రామపంచాయతీ అధికారులు ఎందుకు స్పందించలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిబంధనలకు అనుగుణంగా లైసెన్స్‌ ఉందా? పర్మిట్‌ రూమ్‌ నిర్వహణకు అవసరమైన అనుమతులు పూర్తిగా ఉన్నాయా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.

అధికారుల సంయుక్త తనిఖీలు చేపట్టాలి

పర్మిట్‌ రూమ్‌ అనుమతులు, ట్రేడ్‌ లైసెన్స్‌, టాయిలెట్లు, తాగునీరు, వాష్‌బేసిన్లు, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రహరీ, భద్రతా ప్రమాణాలపై ఎక్సైజ్‌, గ్రామపంచాయతీ, ఆరోగ్యశాఖ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలను అధికారులు నిర్లక్ష్యం చేయరాదని అంటున్నారు.

పర్మిట్‌ రూమ్‌ నిర్వహణపై వస్తున్న ఆరోపణలు నిజమేనా? నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఉన్నాయా? ట్రేడ్‌ లైసెన్స్‌ జారీ అయిందా? అనే అంశాలపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.