ముసాయిదా ఓటర్ల జాబితాలో ఓటర్లు తమ పేరు, ఇతర వివరాలను పరిశీలించుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్.టి.యస్ సూచించారు. జాబితాలో పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులు ఉన్నా సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ) లేదా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్ఓ)కు అభ్యంతరం తెలియజేయవచ్చని తెలిపారు. మ్యాపింగ్ కాని ఓటర్లు, ఎన్యూమరేషన్ ఫారాలకు సంబంధించి కూడా నోటీసులు జారీ చేసి, అవసరమైన సవరణలకు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. ప్రతి ఓటరు జాబితాను పరిశీలించి, తప్పులు ఉంటే నిర్ణీత సమయంలో సవరణకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


