Tuesday, 18 August 2026
  • Home  
  • పీవీఎన్ మాధవ్‌ని కలంకారి పట్టువస్త్రంతో ఘన సన్మానించిన కోలా ఆనంద్
- తిరుపతి

పీవీఎన్ మాధవ్‌ని కలంకారి పట్టువస్త్రంతో ఘన సన్మానించిన కోలా ఆనంద్

శ్రీ కాళహస్తి, ఆగస్టు 17, (పున్నమి న్యూస్): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పోకల వంశీ నాగేంద్ర మాధవ్‌ను ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నియోజకవర్గ కన్వీనర్ కోలా ఆనంద్ ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాధవ్‌కు శ్రీకాళహస్తి దేవస్థానం పవిత్ర తీర్థప్రసాదాలు, స్థానిక హస్తకళల విశిష్టత కలిగిన కలంకారి పట్టువస్త్రాన్ని బహూకరించి సత్కరిస్తూ తన అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం వారు రాబోయే స్థానిక మున్సిపాలిటీ ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా ఓటర్ల మనస్సును గెలుచుకోవచ్చనే అభిప్రాయాలను రాష్ట్ర అధ్యక్షుడితో పంచుకున్నట్లు కోలా ఆనంద్ వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేలా బూత్ స్థాయి నుండి సంస్థాగత బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా నాయకులు నిశ్చయించారు. ఈ ప్రాధాన్యత కలిగిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మరియు సిద్ధార్థ విద్యాసంస్థల అధినేత అశోక్ రాజు, అసెంబ్లీ కో-కన్వీనర్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, కుమార్ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.