ఎంఎంసీ ప్రజావాణికి 29 దరఖాస్తులు
టౌన్ ప్లానింగ్ విభాగానికి అత్యధికంగా 21 దరఖాస్తులు
మల్కాజ్గిరి: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ( ఎం ఎం సి ) ఆధ్వర్యంలో ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 29 దరఖాస్తులు అందాయి.
ఆగస్టు 17న అందిన దరఖాస్తుల్లో టౌన్ ప్లానింగ్ విభాగానికి 21, ఇంజినీరింగ్ విభాగానికి 5, రెవెన్యూ విభాగానికి 3 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ప్రజల నుంచి అందుతున్న ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులు సమగ్రంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజావాణి ద్వారా అందిన ఫిర్యాదులు, వినతులపై నిర్లక్ష్యం లేకుండా స్పందిస్తూ, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలను దరఖాస్తుదారులకు తెలియజేయాలని ఆదేశించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, వారి సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించడం లక్ష్యంగా ప్రజావాణి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు తమ సమస్యలు, వినతులను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎం ఎం సి అధికారులు కోరారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కమిషనర్లు రఘు ప్రసాద్, వేణు గోపాల్, చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రావు, అదనపు చీఫ్ సిటీ ప్లానర్ రంజిత్ కుమార్, చీఫ్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వెంకటేశ్వర్ రెడ్డి, యూబీడీ డైరెక్టర్ సునంద, వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ ఎంటమాలజిస్ట్ మాధవ రెడ్డి, రెవెన్యూ సూపరింటెండెంట్ అజ్మత్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ జీఎం జి.ఎం. ముస్తఫాతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.


