విద్యార్థులు గురువులను, తల్లిదండ్రులను గౌరవించాలని పద్మశ్రీ పురస్కార గ్రహీత, మహాసహస్ర అవధాని గరికపాటి నరసింహారావు సూచించారు. సోమవారం ఎస్బీఐటీ కళాశాలలో నిర్వహించిన మొదటి సంవత్సరం విద్యార్థుల ఓరియంటేషన్ ప్రోగ్రాంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫోన్లు, టీవీ వంటి వ్యాపకాలకు దూరంగా వారంలో రెండు రోజులు ‘డిజిటల్ ఉపవాసం’ పాటించాలని, గురువులతో చర్చించడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చని తెలిపారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.
కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ మాట్లాడుతూ న్యాక్ ‘ఎ ప్లస్’ గ్రేడ్, యూజీసీ అటానమస్ హోదాతో ఉన్నత విద్యా ప్రమాణాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా॥ జి. ధాత్రి మాట్లాడుతూ కోడింగ్, రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్న్‌షిప్‌లను మొదటి సంవత్సరం నుంచే అందిస్తున్నామని చెప్పారు. వైస్-చైర్మన్ కె. శ్రీచైతన్య విలువలతో కూడిన విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రిన్సిపల్ డా॥ జి. రాజ్‌కుమార్ ఏఐ, డేటా సైన్స్ రంగాల్లో నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్లు గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాసరావు, డా॥ ఎ.వి.వి. శివ ప్రసాద్, హెచ్ఓడీలు డా॥ కె. అమిత్ భిందాజ్, డా॥ టి. చరణ్ సింగ్, డా॥ కె. స్పూర్తి, డా॥ యమ్. సుప్రియ మీనన్, డా॥ యమ్. పద్మావతి తదితరులు పాల్గొన్నారు.



