తిరుపతి ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి
*తిరుపతి నగర పరిధిలోని నాయుడు పల్లెం మెయిన్ రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన “శ్రీ స్కంద పెయింట్స్” షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది.ప్రఖ్యాత రెటీనా పెయింట్స్ లిమిటెడ్ వారి ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తూ ఏర్పాటు చేసిన ఈ నూతన వాణిజ్య సముదాయాన్ని తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన తుడా చైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి శ్రీ స్కంద పెయింట్స్ యాజమాన్యం, స్థానిక ప్రముఖులు మరియు అనుచరులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో శ్రీ స్కంద పెయింట్స్ యాజమాన్యం, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపార ప్రముఖులు మరియు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు*





