హైదరాబాద్/ ఖమ్మం
బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. సమావేశానికి ఓబీసీ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షులు రేఖ సత్యనారాయణ యాదవ్, ప్రధాన కార్యదర్శులు పిల్లలమర్రి వెంకట్, వీరభద్రం గౌడ్ హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కోవా లక్ష్మణ్ జీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నారపరాజు రాంచందర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోవా లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారని, ఓబీసీలకు న్యాయం చేసే ప్రభుత్వం నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రాంచందర్ రావు మాట్లాడుతూ ముస్లింలను బీసీ కమ్యూనిటీలో కలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని పేర్కొన్నారు.
గంధమల్ల ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా ఓబీసీల మద్దతు కీలకమని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఓబీసీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర, అన్ని జిల్లాల ఓబీసీ మోర్చా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.


