Monday, 17 August 2026
  • Home  
  • మెగా డీఎస్సీ అభ్యర్థుల విజయం పారదర్శక పాలనకు నిదర్శనం-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
- తిరుపతి

మెగా డీఎస్సీ అభ్యర్థుల విజయం పారదర్శక పాలనకు నిదర్శనం-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీ కాళహస్తి, ఆగస్టు 16, (పున్నమి న్యూస్): కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించి వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపడం అత్యంత అభినందనీయమని శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గం నుండి డీఎస్సీకి ఎంపికైన 36 మంది అభ్యర్థులు ఆయనను కలిసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో ఏళ్ల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టి, డీఎస్సీ నోటిఫికేషన్ రాక పడిన కష్టాలను, పేదరికం, అప్పుల బాధలతో ఎదుర్కొన్న వేదనను అభ్యర్థులు ఎమ్మెల్యేకు వివరించారు. అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్సను కలసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నారా లోకేష్ చొరవతో చేపట్టిన మెగా డీఎస్సీ ద్వారా రూపాయి లంచం లేకుండా కేవలం ప్రతిభతోనే ఉద్యోగాలు సాధించామని అభ్యర్థులు ఆనందబాష్పాలు రాల్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత పాలనలో భ్రష్టుపట్టిన వ్యవస్థలను ప్రక్షాళన చేసి కూటమి ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో కొలువులు అందించిందని, మెరిట్‌తో విజయం సాధించిన ఉపాధ్యాయులు తమ విజయ ప్రయాణాన్ని, ప్రభుత్వ నిజాయితీని సమాజానికి గర్వంగా చాటిచెప్పాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.