ఖాజీపేట పోలీస్ స్టేషన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఖాజీపేట: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఖాజీపేట పోలీస్ స్టేషన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాజీపేట ఏఎస్ఐ అసిఫ్ ఖాన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం పోలీస్ సిబ్బంది జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


