*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 15 చిట్టమూరు మండలం,*
చిట్టమూరు పోలీస్ స్టేషన్ ఆవరణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం స్థానిక ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు సిబ్బంది, విద్యార్థులు కలిసి జనగణమన ఆలపించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ఎందరో సమరయోధులు చేసిన త్యాగాలను స్మరించుకోవాలని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. యువత చక్కగా చదువుకొని దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం చిట్టమూరు ఎస్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు, సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేశారు.



