విశాఖపట్నం జిల్లా, ఆనందపురం మండలం(పున్నమి ప్రతినిధి), ఆగస్టు 15: టోల్గేట్ సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో అశోక్ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అశోక్ ఎంటర్ప్రైజెస్ అధినేత, ‘బంకు రాజు’గా పేరొందిన బాలి అప్పలరాజు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. బాలి రామసత్యం కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాలి అప్పలరాజు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, యువత క్రమశిక్షణ, నిజాయితీ, దేశభక్తితో ముందుకు సాగి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అశోక్ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తూ సామాజిక బాధ్యతకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో బంకు సిబ్బంది, ప్రజలు పాల్గొని జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు.







