ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని మహాదేవపురం డివిజన్లోని RK టౌన్షిప్ మరియు శిల్పా ఫైన్ వ్యాలీ కాలనీలలో ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రోడ్ల సమస్యల పరిష్కారానికి *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలను హన్మంత్ రెడ్డి గారి* ప్రత్యేక చొరవతో CMC నిధుల నుంచి రూ.1.40 కోట్లు మంజూరయ్యాయి.
ఈ నిధులతో చేపట్టనున్న CC రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో *ముఖ్యఅతిథిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి గారు* పాల్గొని అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, మహదేవ్పూర్ డివిజన్లోని ప్రతి కాలనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులను కూడా తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సిద్ధనోళ్ళ సంజీవ్ రెడ్డి, మైసిగారి శ్రీనివాస్, టీపీసీసీ మైనారిటీ విభాగం రాష్ట్ర సంయుక్త కన్వీనర్ సమీర్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలేటి శ్రీనివాస్, కాలనీ ప్రతినిధులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


