బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నెల్లూరుకు చెందిన సీనియర్ నాయకుడు మొగరాల సురేష్ నియమితులయ్యారు. 1992 నుంచి రాజకీయ, సామాజిక రంగాల్లో చురుగ్గా ఉన్న ఆయన ABVP, BJYM, OBC మోర్చాలో కీలక బాధ్యతలు నిర్వహించారు. BJYM జిల్లా అధ్యక్షుడిగా నాలుగు పర్యాయాలు, OBC మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, మూడు పర్యాయాలు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. దివంగత సీహెచ్ రామకృష్ణారెడ్డి ప్రోత్సాహంతో బీజేపీలో చేరిన సురేష్, పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం హాస్పిటల్ కమిటీ, మెడికల్ కాలేజీ అభివృద్ధి కమిటీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా మొగరాల సురేష్