Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలులో వైభవంగా శ్రీ విశ్వనాథ స్వామి వారికి రుద్రాభిషేకాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మనుబోలులో వైభవంగా శ్రీ విశ్వనాథ స్వామి వారికి రుద్రాభిషేకాలు

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 17 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలోని శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానంలో కార్తీక మాసం కోటి సోమవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
  • ఉదయం నుంచి స్వామివారికి రుద్రాభిషేకాలు, అర్చనలు నిర్వహించగా, వందలాది మంది మహిళలు భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
  • ప్రదోష కాలంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 17 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలోని శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానంలో కార్తీక మాసం కోటి సోమవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి రుద్రాభిషేకాలు, అర్చనలు నిర్వహించగా, వందలాది మంది మహిళలు భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రదోష కాలంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెర్లోపల్లి గ్రామానికి చెందిన భూతాటి నరసింహ, సోనిత దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *