Monday, 17 August 2026
  • Home  
  • స్వాతంత్ర్య దినోత్సవం నాడు చిన్నారికి వీల్‌చైర్‌ బహుకరణ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

స్వాతంత్ర్య దినోత్సవం నాడు చిన్నారికి వీల్‌చైర్‌ బహుకరణ

ఆత్మకూరు, ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు మున్సిపాలిటీ 7వ వార్డు తూర్పు వీధికి చెందిన 13 ఏళ్ల చిన్నారి షేక్‌ నజ్మాకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీ సాంబశివ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ కంచి పరమేశ్వర రెడ్డి మానవతా దృక్పథంతో వీల్‌చైర్‌ బహుకరించారు.షేక్‌ నజ్మా పుట్టుకతోనే మతిస్థిమితం లేకపోవడంతో పాటు అంగవైకల్యంతో నడవలేని పరిస్థితిలో మంచానికే పరిమితమైంది. చిన్నారి పరిస్థితిని తెలుసుకున్న కంచి పరమేశ్వర రెడ్డి గతంలోనే ఆమె వైద్య ఖర్చుల కోసం రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చిన్నారి ఇంటికి స్వయంగా వెళ్లి వీల్‌చైర్‌ను అందజేశారు.దేశవ్యాప్తంగా ప్రజలు స్వాతంత్ర్య సంబరాలు జరుపుకుంటున్న వేళ, నడవలేని చిన్నారికి వీల్‌చైర్‌ అందించి సంచార స్వేచ్ఛను కల్పించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తూ ఆకలి తీర్చే అన్నదాతగా, బాధితులకు భరోసా కల్పించే ధర్మదాతగా కంచి పరమేశ్వర రెడ్డి సేవలు అందిస్తున్నారని వారు కొనియాడారు. ఈ సందర్భంగా తూర్పు వీధి నివాసులు, కాలనీవాసులు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.