విశాఖ గాజువాక (పున్నమి ప్రతినిధి): 87వ వార్డులో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాధం (జగన్) పాల్గొని ప్రజలు, విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
పాత వడ్లపూడి, తిరుమలనగర్, వడ్లపూడి, అప్పికొండ ప్రాథమిక పాఠశాలలు, కణితి హైస్కూల్, రామకృష్ణ పబ్లిక్ స్కూల్, సిద్ధార్థ నగర్‌లో జరిగిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవాలని, వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని బొండా జగన్నాధం సూచించారు.
అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయరామరాజు, సెక్రటరీ బొట్టా ప్రకాష్, బెల్లంకొండ రాజన్ రాజు, ఆనంద్ కుమార్, జనసేన వార్డు అధ్యక్షులు శిరసపల్లి కనకరాజు, కడుపుట్ల శ్రీను, దాలయ్య, మూర్తి, సుందర్, సునీల్, సన్యాసిరావు, అసోసియేషన్ సభ్యులు, పాఠశాలల యాజమాన్యాలు పాల్గొన్నారు.





