మహనీయుల త్యాగఫలం స్వాతంత్ర దినోత్సవం అని ప్రధానోపాధ్యాయు రాలు కె.భారతి అన్నారు.రాజంపేట మండలం కొత్త బోయిన పల్లి పి.యం.శ్రీ.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో శనివారం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహిం చారు. త్రివర్ణ పతాకం ఎగురవేసి వందనం చేసారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1947 ఆగస్టు 15వ తేదీన దేశానికి స్వాతం త్ర్యం వచ్చిందనీ,వందలాది సంవత్సరాల విదేశీ పాలన అంతమయిందన్నారు. మహాత్మా గాంధీ, భగత్ సింగ్,సుభాష్ చంద్రబోస్ వంటి ఎంతో మంది వీరుల త్యాగాల ఫలితంగా మనకు స్వేచ్ఛ దక్కింద న్నారు.ముఖ్య అతిథులుగా గొట్టి ముక్కల పెంచల రావు, పోలిచర్ల గోపాలరావు పాల్గొని విద్యార్థులకు దేశభక్తి గురించి వివరించారు. దాతలు గొట్టిముక్కల వెంకటసుబ్బయ్య, గొట్టిముక్కల పెంచల రావు,బోడిచర్ల వెంకట నరసయ్య, పోట్టా చిన్న శంకరయ్య, గొట్టి ముక్కల పెంచల నరసింహారావు, బోడగల సాయి,దార్ల నాగ బ్రహ్మచారి పదవ తరగతిలో ప్రతిభ సాధించిన విద్యార్థిని విద్యార్థులకు నగదు బహుమతి ప్రధానం చేశారు. చిన్నా రులు సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలతో నూతన ఉత్సాహం నింపారు. క్రీడల్లో విజయం సాధించిన చిన్నారులకు, చిత్రలేఖనంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతి బహుమతి ప్రధానం గావించారు. దేశభక్తిని వివరిస్తూ చిన్నారుల ప్రసంగాలు విశేషంగా ఆకట్టు కున్నాయి.ఇంకా ఈ సమావేశంలో మొలక ఓబులేసు,శేషగిరి, రాజయ్య,పారా శ్రీరాములు, శివ ప్రసాద్ గౌడ్,ఎస్.ప్రభాకర్రావు, విజయ భాస్కర్,అనిల్, మజ్జారి చెన్న కేశవులు,సువర్ణ సుందరి, అమరావతి,మధు వాణి,ప్రణవి,దార్ల శ్రీనివాసులు ఆచారి, మేడా సాయినాథ్, ప్రశాంత్,సి.ఆర్.పి. బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


