పులివెందుల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తుంగభద్ర ప్రాజెక్ట్ హైలెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి , మారెడ్డి భరత్ రెడ్డి, పులివెందుల జడ్పీటీసీ మారెడ్డి లత రెడ్డి , వేంపల్లె టీడీపీ ఇంచార్జ్ అజ్జుగుట్టు రఘునాథరెడ్డి కూటమి నాయకులు,కార్యకర్తలతో కలిసి మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు.జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం జనగణమన ఆలపిస్తూ, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం జరిగింది. వారి త్యాగాల ఫలితంగా మనకు లభించిన స్వేచ్ఛను కాపాడుకోవడంతో పాటు, దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవడం జరిగింది.స్వాతంత్ర్యం అంటే కేవలం హక్కులు మాత్రమే కాదు.. బాధ్యత కూడా. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, సమాజ ప్రగతి కోసం ఐక్యంగా పనిచేస్తూ, భవిష్యత్ తరాలకు మరింత బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని అందించేందుకు మన వంతు కృషి చేయాలని సంకల్పించాం.దేశం కోసం త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అభివృద్ధి మరియు సంక్షేమాన్ని ప్రతి కుటుంబానికి చేరువ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేశాం.పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజల సమక్షంలో జరిగిన ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తదనంతరం అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

టిడిపి కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు